న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా పిలవలేదు: గవాస్కర్ లేకుండానే ట్రోఫీ ప్రదానం!

India vs Australia: Sunil Gavaskar could miss trophy presentation ceremony after Sydney Test

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ పేరు బోర్డర్-గవాస్కర్ టోర్నీ అన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ అటు భారత్‌లో జరిగినా, ఇటు ఆస్ట్రేలియాలో జరిగినా ముగింపు రోజున ట్రోఫీని ప్రధానం చేసేందుకు గాను అలెన్‌ బోర్డర్‌, సునీల్‌ గావస్కర్‌ ఇద్దరూ వస్తారు.

ఐసీసీ ప్రకటన: టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లివేఐసీసీ ప్రకటన: టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లివే

అయితే, ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌ ముగింపు రోజున సునీల్ గవాస్కర్‌ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గవాస్కర్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ఆహ్వానం పంపలేదు. దీంతో గవాస్కర్ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందించడం లేదు.

అలెన్‌ బోర్డర్‌ ఒక్కడే ట్రోఫీని

అలెన్‌ బోర్డర్‌ ఒక్కడే ట్రోఫీని

1996 నుంచి జరుగుతున్న ఈ సిరీస్‌ విజేతకు ఈసారి మాత్రం అలెన్‌ బోర్డర్‌ ఒక్కడే ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ గత మే నెలలో గవాస్కర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గవాస్కర్‌కు ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ఆహ్వానం మాత్రం అందలేదు.

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ

ఇదే విషయాన్ని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. కనీసం సిరీస్‌కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని సన్నీ చెప్పారు. "ఈ ట్రోఫీ ప్రదానోత్సవానికి రావడం కుదురుతుందా అని మే నెలలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ అడిగాడు. సంతోషంగా వస్తా అని చెప్పా. కానీ తర్వాత సదర్లాండ్‌ పదవి నుంచి దిగిపోయాడు. ఆపై నన్నెవరూ సంప్రదించలేదు'' అని గావస్కర్‌ అన్నాడు.

 హెడ్‌ టిమ్‌ విటకెర్‌ మాట్లాడుతూ

హెడ్‌ టిమ్‌ విటకెర్‌ మాట్లాడుతూ

మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ టిమ్‌ విటకెర్‌ మాట్లాడుతూ జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గవాస్కర్‌కు ఆహ్వానాలు పంపామని అన్నారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్‌ షాట్స్‌ చూపగలరా? అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం' అని ఆయన బదులిచ్చారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2015లో కూడా చివరి నిమిషంలో ఆహ్వానించింది. అక్కడే ఉండటంతో సన్నీ సరేనన్నారు.

 2007-08లోనూ ఇలాగే

2007-08లోనూ ఇలాగే

2007-08లోనూ ఇలాగే చేసింది. 2000లో ఆస్ట్రేలియా శతాబ్ది జట్టును ఎంపిక చేసేందుకు సీఏ గవాస్కర్‌ను ఆ ప్యానెల్‌లో సెలెక్టర్‌గా నియమించింది. అయితే, ఆ తర్వాత నిర్వహించిన వేడుకకి మాత్రం సన్నీని పిలవలేదు. ఇక, గురువారం నుంచి ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభం కాబోతుంది. ఈ లోపు సీఏ ప్రతినిధులు గావస్కర్‌కు అధికారిక ఆహ్వానం పంపి బహుమతి ప్రదానోత్సవానికి రప్పిస్తారేమో చూడాలి.

2-1 ఆధిక్యంలో టీమిండియా

2-1 ఆధిక్యంలో టీమిండియా

రెండేళ్ల కిందట భారత్‌లో ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలవడంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ భారత్‌ వద్దే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. చివరి మ్యాచ్‌ గెలిచి 3-1తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది.

Story first published: Wednesday, January 2, 2019, 10:01 [IST]
Other articles published on Jan 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X