న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారాపై షేన్ వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలంటున్న ఇండియన్ ఫ్యాన్స్!

India vs Australia: Shane Warne caught under criticism after referring Cheteshwar Pujara as Steve on-air
Ind vs Aus 2020,1st Test : Shane Warne Caught Under criticism After Referring Pujara As ‘Steve’

అడిలైడ్: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఒకరిని మించి మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగగా.. భారత్ బ్యాట్స్‌మెన్ ధీటుగా ఎదుర్కొన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యం రనౌట్‌తో స్పల్ప స్కోర్‌కే పరిమితమైనా.. అనంతరం భారత్ బౌలర్లు రఫ్పాడించడంతో ఆసీస్ కూడా అదే తరహా పోరాటాన్ని కనబరుస్తుంది.

ఇక భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓపెనర్లు పృథ్వీషా(0), మయాంక్‌ అగర్వాల్‌ (17) త్వరగా ఔటైన వేళ నయావాల్‌ చతేశ్వర్‌ పుజారా (43; 160 బంతుల్లో 2×4) ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. బంతి ఏదైనా అడ్డుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. అతని ఆటతీరును విశ్లేషిస్తూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్‌ వార్న్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి.

చెతేశ్వర్ అని పలకరాక..

చెతేశ్వర్ అని పలకరాక..

ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్‌కు ఆడుతున్నప్పుడు పుజారాను అక్కడి సహచరులు 'స్టీవ్‌' అని పిలిచేవారని వార్న్‌ గుర్తు చేశాడు. చెతేశ్వర్‌ అని పలకడం కష్టమనిపించడంతో ఇంగ్లీష్‌ ఆటగాళ్లు అలా పిలిచేవారని వివరించాడు. ఇంకా మరికొన్ని విషయాలు చెప్పాడు. ఆ క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మిగతా వారూ ముసిముసిగా నవ్వారు. అయితే ఆసియా వాసులు, ఇతర వర్ణాల వారిని యార్క్‌షైర్‌ ఆటగాళ్లు వర్ణ వివక్షతో అలా పిలిచేవాళ్లని ఈ మధ్యే ఓ విచారణలో తేలింది. యార్క్‌షైర్‌ క్రికెటర్‌ అజీమ్‌ రఫీక్‌ కేసు పెట్టడంతో ఇదంతా బయటకొచ్చింది.

క్షమాపణలు చెప్పాలి..

క్షమాపణలు చెప్పాలి..

'ఆసియా జాతికి చెందిన టాక్సీ డ్రైవర్లు, రెస్టారంట్‌ పనివాళ్లను అక్కడ నిరంతరం స్టీవ్‌ అని పిలుస్తారు. బయట దేశం నుంచి వచ్చిన క్రికెట్‌ ప్రొఫెషనల్‌ చతేశ్వర్‌ పుజారానూ అలాగే పిలిచేవారు. ఎందుకంటే అతడిని పేరును పలకలేకపోవడమే కారణం' అని భట్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు వెల్లడించాడు. యార్క్‌షైర్‌ ఆటగాళ్లు తనను స్టీవ్‌ అని పిలిచేవారని గతంలో పుజారా సైతం చెప్పడం గమనార్హం. వర్ణ వివక్షకు చెందిన పదమని విచారణలో బయటపడ్డాకా 'స్టీవ్‌' అని రిఫర్‌ చేయడంతో వార్న్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. నయావాల్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆసీస్‌కు షాక్..

ఆసీస్‌కు షాక్..

ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకు ఆలౌటవ్వగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులకు ఆస్ట్రేలియా ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (8), జో బర్న్స్‌ (8)ను పెవిలియన్‌కు చేరారు. 14వ ఓవర్‌లో వేడ్‌ను, 16వ ఓవర్‌లో బర్న్స్‌ను బుమ్రా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

వీరిద్దరు రివ్యూకు వెళ్లినా ఆసీస్‌కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (21 బ్యాటింగ్) రెండు సార్లు ఔట్‌ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో అతని బ్యాట్‌కు తాకిన బంతి వికెట్‌కీపర్‌, ఫస్ట్‌ స్లిప్‌ మధ్యలో నుంచి వెళ్లగా.. బంతి అందుకోవడంలో సాహా, పుజారా విఫలమయ్యారు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో వచ్చిన సునాయస క్యాచ్‌ను బుమ్రా చేజార్చాడు. 22 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 2 వికెట్లకు 40 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(1 బ్యాటింగ్), లబుషేన్ (21 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, December 18, 2020, 12:46 [IST]
Other articles published on Dec 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X