న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా!!

India vs Australia: Rohit Sharma continues 8 year long streak in ODIs
Rohit Sharma's 8 Year Long Streak In ODIs, India's Highest Individual ODI Score In 2020

హైదరాబాద్: టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఏ ఒక్క భారత ఆటగాడు కూడా మూడంకెల స్కోరు అందుకోలేదు. ఈరోజు జరిగిన మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా చేసిన 92 పరుగులే అత్యధికం. దీంతో 2020లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ రోహిత్ నిలిచాడు.

 వరుసగా ఎనిమిదో ఏడాది:

వరుసగా ఎనిమిదో ఏడాది:

ఈ ఏడాది జనవరి 19న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 119 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 2020లో భారత్‌ తరఫున ఓ ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఎవరికీ సాధ్యం కాని అత్యధిక పరుగుల రికార్డును రోహిత్‌ కొనసాగిస్తుండటం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో తొడ కండరాల గాయం నుంచి రోహిత్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో.. వన్డే, టీ20 సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయలేదు. డిసెంబర్ 11న ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే.. టెస్ట్ సిరీస్‌కు ఎంపికవుతాడు.

రిహాబిలిటేషన్‌లో రోహిత్:

రిహాబిలిటేషన్‌లో రోహిత్:

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఫస్ట్ రెండు టెస్ట్‌లకు దూరమైన రోహిత్ శర్మ.. ఆఖరి రెండు మ్యాచ్‌లు ఆడటంపై కూడా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న రోహిత్ ఫిట్‌గా లేడని వైద్యులు నివేదిక ఇవ్వడంతో ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ ప్రకటించింది. క్వారంటైన్‌ నిబంధనలను పరిశీలిస్తే ఆఖరి రెండు టెస్టులు కూడా ఆడటం అనుమానంగా మారింది. అసలు రోహిత్ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు.

గతేడాదిగా ప్రచారం:

గతేడాదిగా ప్రచారం:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని గతేడాదిగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఎడమోహం, పెడమోహంగా ఉండటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా కూడా రోహిత్, విరాట్ కనీసం ఒకరికొకరు చూసుకోలేదు. తాజాగా రోహిత్‌ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెల్లడించడం అందర్ని విస్మయానికి గురిచేసింది. అసలు వీరి మధ్య ఏం జరుగుతుందనే సందేహం కలుగుతోంది.

వన్డేల్లో రోహిత్ శర్మ రికార్డు:

వన్డేల్లో రోహిత్ శర్మ రికార్డు:

2013 - 209

2014 - 264

2015 - 150

2016 - 171*

2017 - 208*

2018 - 152

2019 - 159

2020 - 119

హమ్మయ్య.. మూడో వ‌న్డేలో టీమిండియా విజయం!! కోహ్లీసేనకు తప్పిన క్లీన్‌స్వీప్!

Story first published: Wednesday, December 2, 2020, 18:52 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X