న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హమ్మయ్య.. మూడో వ‌న్డేలో టీమిండియా విజయం!! కోహ్లీసేనకు తప్పిన క్లీన్‌స్వీప్!

India vs Australia: T Natarajan, Shardul Thakur shine India pick up consolation win in Canberra

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. సిరీస్‌ను 1-2 తేడాతో ముగించి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది. 303 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను 289కే ఆలౌట్‌ చేసి ఊపిరి పీల్చుకుంది. ఆరోన్‌ ఫించ్‌ (75), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (59) అర్ధ శతకాలతో చెలరేగారు. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ 3, న‌ట‌రాజ‌న్ 2 వికెట్లతో రాణించారు. డిసెంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్.. ఇక డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది.

<strong>India vs Australia: మాక్స్‌వెల్‌ భారీ సిక్సర్.. ట్రోల్ చేసిన పంజాబ్!!</strong>India vs Australia: మాక్స్‌వెల్‌ భారీ సిక్సర్.. ట్రోల్ చేసిన పంజాబ్!!

 న‌ట‌రాజ‌న్ షో:

న‌ట‌రాజ‌న్ షో:

303 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియాని ఆరంభంలోనే భారత బౌలర్లు దెబ్బతీశారు. అరంగేట్ర పేసర్ టీ న‌ట‌రాజ‌న్ ఆరో ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ మార్నస్ లబుషేన్ (7)ను బౌల్డ్‌ చేశాడు. లబుషేన్‌ భారీ షాట్‌కు యత్నించగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకుని బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో న‌ట‌రాజ‌న్ ఖాతాలో మొదటి వికెట్ చేరింది. అనంతరం వచ్చిన స్టీవ్ ‌స్మిత్ (7), మొయిసెస్ హెన్రిక్స్ (22) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన కెప్టెన్ అరోన్ ఫించ్ (75: 82 బంతుల్లో 7x4,3x6) ఆసీస్ స్కోరు బోర్డుని నడిపించాడు.

 కంగారు పెట్టిన మాక్స్‌వెల్:

కంగారు పెట్టిన మాక్స్‌వెల్:

ఫించ్ వ్యక్తిగత స్కోరు 22 వద్ద శిఖర్ ధావన్ క్యాచ్ వదిలేయగా.. అనంతరం హార్దిక్ పాండ్యా ఒక రనౌట్ మిస్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా కూడా ఒక క్యాచ్‌ని నేలపాలు చేశాడు. దాంతో జీవనదానాల తర్వాత ఫించ్ మరింత రెచ్చిపోయి ఆడాడు. కానీ జట్టు స్కోరు 123 వద్ద ఫించ్‌ని రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. అనంతరం కెమెరూన్ గ్రీన్ (21) తక్కువ స్కోరుకే ఔటైపోయాడు. ఈ సమయంలో గ్లెన్ మాక్స్‌వెల్ (59: 38 బంతుల్లో 3x4, 4x6) భారీ షాట్లతో భారత్‌ని మరోసారి కంగారు పెట్టాడు. కానీ జట్టు స్కోరు 268 వద్ద మాక్స్‌వెల్‌ని క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా.. మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. విజ‌యానికి మ‌రో 33 బంతుల్లో 35 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బుమ్రా యార్క‌ర్‌కు క్లీన్ ‌బౌల్డ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆస్ట‌న్ అగార్ 28 బంతుల్లో 28 ప‌రుగులు చేసి పోరాడినా.. ఆసీస్ గ‌ట్టెక్క‌లేక‌పోయింది. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకున్నాడు.

 కోహ్లీ హాఫ్ సెంచరీ:

కోహ్లీ హాఫ్ సెంచరీ:

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 26 పరుగుల వద్ద శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయింది. 27 బంతుల్లో 16 పరుగులు చేసిన ధావన్.. సీన్ అబాట్ బౌలింగ్‌లో అగర్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. అగర్ బౌలింగ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 పరుగులతో నిలకడగా రాణించాడు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్‌గా చిక్కి కోహ్లీ ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జంపా బౌలింగ్‌లో లబుషేన్‌‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అగర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది.

ఆదుకున్న జడేజా, పాండ్యా:

ఆదుకున్న జడేజా, పాండ్యా:

152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఊపిరి పోశారు. మరో వికెట్ చేజారకుండా కంగారు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. హార్థిక్ పాండ్యా 76 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రవీంద్ర జడేజా మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 50 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జడేజా, పాండ్యా భాగస్వామ్యంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో అగర్‌ రెండు వికెట్లతో రాణించగా.. జంపా, సీన్ అబాట్, హజల్‌వుడ్‌కు తలో వికెట్ దక్కింది.

India vs Australia: మాక్స్‌వెల్‌ భారీ సిక్సర్.. ట్రోల్ చేసిన పంజాబ్!!

Story first published: Wednesday, December 2, 2020, 17:44 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X