న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌లానే మైదానంలో ప్లేయర్లతో ఆర్కీ చిల్లర్

India vs Australia: Remove Virat Kohli, Cheteshwar Pujara and India will struggle too, says Tim Paine

సిడ్నీ: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 137 పరుగుల తేడాతో గెలుపొందిన ఇండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే ఆత్మవిశ్వాసంతో జనవరి 3న నుంచి నాలుగో టెస్టు ఆడేందుకు సిడ్నీ బయలుదేరుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు ఏడేళ్ల బాలుడు ఆర్చీ స్కిల్లర్‌ సహాయ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఏడేళ్ల ఆసీస్ కో-కెప్టెన్ ఆర్కీ చిల్లర్

ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్‌లో విజయం అనంతరం సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెటర్లతో కరచాలనం చేశారు. భారత ఆటగాళ్లతో కరచాలనం చేసిన వారిలో ఏడేళ్ల ఆసీస్ కో-కెప్టెన్ ఆర్కీ చిల్లర్ కూడా ఉన్నాడు. మూడో టెస్టు కోసం ప్రకటించిన ఆసీస్ జట్టులో ఆర్కీ చిల్లర్ కూడా స్థానం పొందిన సంగతి తెలిసిందే. ఇతన్ని కో-కెప్టెన్‌గా నియమిస్తూ బాక్సింగ్ డే టెస్టుకు ఎంపిక చేశారు. కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు చిల్లర్ కూడా మెల్‌బోర్న్ టెస్ట్‌కు పగ్గాలు చేపట్టాడు. పైన్‌తో కలిసి టాస్‌కు వెళ్లాడు.

ఆసీస్ కెప్టెనే స్వయంగా వచ్చి క్రికెటర్లతో

మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఆర్చీ మైదానంలోకి వచ్చి టీమిండియా సభ్యులను అభినందించాడు. హృద్యంగా కరచాలనం చేశాడు. నిజంగా ఆసీస్ కెప్టెన్ స్వయంగా వచ్చి ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేస్తే ఎలా ఉంటుందో చిల్లర్ ప్రవర్తించిన విధానం కూడా అలానే ఉంది. టీమిండియా ఆటగాళ్లు, అంపైర్లు, మిగిలిన స్టాఫ్‌తో ఆర్కీ చిల్లర్ కరచాలనం చేసిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

టీమిండియా ప్లేయర్లంతా వెన్నుతట్టి

చిల్లర్‌తో కరచాలనం చేసిన భారత ఆటగాళ్లు అతన్ని అభినందించారు. షమి, ఇషాంత్‌, రిషభ్‌ పంత్‌, పుజారా, అశ్విన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సహాయక సిబ్బంది అతడి వెన్నుతట్టారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా పంచుకొన్న ఈ ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

మేక్‌ ఏ విష్‌ ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ క్రికెట్‌

ఆసీస్‌ తరఫున ఆడాలన్నది అతడి కోరిక. ఆస్ట్రేలియా క్రికెట్‌తో మాట్లాడి బాక్సింగ్ డే టెస్టుకు చిల్లర్‌ను ఆసీస్ కెప్టెన్‌ను చేసింది. మేక్‌ ఏ విష్‌ ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాతో చర్చించి ఇందుకు ఒప్పించింది. కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్వయంగా అతడికి ఫోన్‌ చేసి జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. నేథన్‌ లైయన్‌ను అమితంగా ఇష్టపడే ఆర్చీకి లెగ్‌ స్పిన్నర్‌ అవ్వాలన్నది కల.

Story first published: Monday, December 31, 2018, 10:00 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X