న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై అధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్ వీరే..

India vs Australia: Pujaras mammoth 193 sixth highest score by an Asian in Australia

సిడ్నీ: టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఆస్ట్రేలియా బౌలర్లకు కఠిన పరీక్షకు గురి చేశాడు. వారు బంతులు వేస్తూ అలసిపోతున్నారు. అంత వరకు ఓపికగా క్రీజులో ఎదురుచూసిన పుజారా కంగారూ బౌలర్లు వేసే చెత్త బంతుల్ని చక్కగా బౌండరీకి తరలించాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుత తరహాలో సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో సెంచరీ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా.. మరో 65 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే 130 పరుగులు చేసేందుకు 250 బంతులు తీసుకున్నాడు.

 22 గంటలపాటు బ్యాటింగ్‌ చేసిన పూజారా

22 గంటలపాటు బ్యాటింగ్‌ చేసిన పూజారా

తొలి ఇన్నింగ్స్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే వెయ్యికి పైగా బంతులు.. మొత్తంగా 22 గంటలపాటు బ్యాటింగ్‌.. మూడు సెంచరీలు ఇదీ చతేశ్వర్ పుజారా ఆసీ‌స్‌తో టెస్టు సిరీ‌స్‌లో చూపుతున్న జోరు. ఇలా ఆసీస్ గడ్డపై అధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్ జాబితాలోకి చతేశ్వర్ పూజారా చేరిపోయాడు.

 సచిన్ లాంటి అగ్రప్లేయర్ల జాబితాలోకి

సచిన్ లాంటి అగ్రప్లేయర్ల జాబితాలోకి

ఆసీస్ గడ్డపై అధికంగా సచిన్ టెండూల్కర్ (241)పరుగులు సాధిస్తే.. తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్(233), రవిశాస్త్రి(206), అజహర్ అలీ(205), వీరేందర్ సెహ్వాగ్(195)లు ఉన్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి (193)పరుగులతో వారితో సమానంగా చేరిపోయాడు.

డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో

డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో

శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా.. తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్‌ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. వేగం పెంచాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

పుజారాను పెవిలియన్‌కు పంపిన లయన్‌

రెండో రోజు తొలి రోజు దూకుడునే ఆసీస్‌ బౌలర్లపై కొనసాగించాడు. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్‌ లయన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ 130వ ఓవర్లో నాథన్‌ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

1
43626
Story first published: Friday, January 4, 2019, 17:13 [IST]
Other articles published on Jan 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X