న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో సిరీస్ మొత్తానికి పృథ్వీ షా దూరం: మయాంక్, పాండ్యాలకు పిలుపు

India vs Australia: Prithvi Shaw ruled out of Test series, Mayank Agarwal, Hardik Pandya called up

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మడమ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు.

మురళీ నాకు తెలుసు... కోహ్లీలో అది మీకు నచ్చదు కదా!: ఆసీస్ కెప్టెన్ స్లెడ్జింగ్మురళీ నాకు తెలుసు... కోహ్లీలో అది మీకు నచ్చదు కదా!: ఆసీస్ కెప్టెన్ స్లెడ్జింగ్

అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ పృథ్వీ షా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా షా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.

 మూడో టెస్ట్ నాటికి కోలుకుంటాడని

మూడో టెస్ట్ నాటికి కోలుకుంటాడని

రెండో టెస్టుకు ముందు పృథ్వీ షా జాగింగ్ చేస్తుండటంతో మెల్ బోర్న్ వేదికగా జరిగే మూడో టెస్ట్ నాటికి కోలుకుంటాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, బాక్సింగ్ డే టెస్టు సమయానికి కూడా అతను ఫిట్‌గా ఉండే అవకాశం లేకపోవడంతో ఇండియాకు పంపించేయాలని నిర్ణయించారు.

ఆసీస్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్లు

ప్రస్తుతం ఆసీస్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఓపెనర్లుగా బరిలోకి వస్తోన్న మురళీ విజయ్, కేఎల్ రాహుల్ చెత్త ప్రదర్శన చేస్తున్నారు. ఇక, పృథ్వీ షా స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తోన్న కర్ణాటకకు చెందిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో అతడు ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లనున్నాడు.

హార్ధిక్ పాండ్యాకు కూడా పిలుపు

హార్ధిక్ పాండ్యాకు కూడా పిలుపు

మరోవైపు రంజీల్లో సత్తా చాటి ఫిట్‌నెస్ సాధించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో టెస్టుకి ముందే జట్టుతో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ ఆడుతూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా పాండ్యా వెన్నుముకకి గాయమవడంతో మైదానంలోనే కుప్పకూలాడు.

ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో

ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో

దీంతో నడవలేని స్థితిలో ఉన్న పాండ్యాని స్ట్రెచర్ సాయంతో మైదానం వెలుపలకి తీసుకెళ్లాల్సి వచ్చింది. గాయం నుంచి తాజాగా కోలుకున్న హార్దిక్ పాండ్యా, ఇటీవల రంజీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో 137 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 73 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు.

1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా

1-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి తిరిగి మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న మిగతా రెండు టెస్టులకు సెలక్టర్లు పాండ్యాను కూడా ఎంపిక చేశారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Monday, December 17, 2018, 18:27 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X