న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ పిచ్ ఆసీస్‌కే బెడిసికొట్టనుందా?: వాన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం

India vs Australia: Michael Vaughan says green top in Perth could backfire on Australia

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టు కోసం రూపొందించిన పిచ్ బౌన్స్, పేస్‌కు అతిగా సహకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. పెర్త్ పిచ్‌ను చూస్తుంటే ఆస్ట్రేలియాకే బెడిసికొట్టొచ్చని అభిప్రాయాన్ని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్ వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా vs ఇండియా: 'పెర్త్ టెస్టులో టాస్ ఓడితే మంచిదే'ఆస్ట్రేలియా vs ఇండియా: 'పెర్త్ టెస్టులో టాస్ ఓడితే మంచిదే'

అంతేకాదు భారత జట్టులో కూడా అద్భుతమైన పేసర్లు ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. రెండో టెస్టు కోసం అత్యంత బౌన్సీ పిచ్‌ రూపొందించానని వాకా ప్రధాన క్యూరేటర్‌ బ్రెట్ సిప్‌థోర్ప్ తెలిపాడు. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఓపస్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. గురువారం పెర్త్ పిచ్‌ని మైకెల్‌ వాన్ వీక్షించాడు.

వాన్ మాట్లాడుతూ

వాన్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా వాన్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌లో, అడిలైడ్‌ ఓవల్‌లో టీమిండియా బౌలింగ్‌ దాడి చూశా. పెర్త్‌ పిచ్‌ను చూసిన బుమ్రా, షమి, ఇషాంత్‌ బహుశా రాత్రి నిద్రపోయే ముందు ఆసీస్‌కు కచ్చితంగా ధన్యవాదాలు చెబుతారనిపిస్తోంది. కోహ్లీసేన ముగ్గురు పేసర్లు ఆసీస్‌ పేసర్లను మించి రాణించారు. వారు అద్భుతం" అని మైకేల్ వాన్‌ అన్నాడు.

అడిలైడ్‌లో 20కి 14 వికెట్లు తీశారు

అడిలైడ్‌లో 20కి 14 వికెట్లు తీశారు

"అడిలైడ్‌లో 20కి 14 వికెట్లు తీశారు. దీనిని బట్టి చూస్తే ఆస్ట్రేలియా పెద్ద సాహసమే చేస్తోంది. ఆతిథ్య బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించే పిచ్‌ కచ్చితంగా అవసరమే. అడిలైడ్‌ ఓవల్‌లో భారత బౌలింగ్‌ దాడి చూశాక ఇలాంటి పరిస్థితులు సృష్టించడం అనవసరం అనిపిస్తోంది. వారు సుదీర్ఘంగా అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారు" అని వాన్‌ అన్నాడు.

నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం

నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం

ఈ ఏడాది జనవరిలో సఫారీ గడ్డపై జోహన్స్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ తర్వాత మళ్లీ టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయని మైకేల్ వాన్ చెప్పాడు. రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్‌‌లో పాత సంప్రదాయం ప్రకారం వేగంగా ఉండే పిచ్‌ను ఇక్కడ సిద్ధం చేశారు. వికెట్‌పై పొరలు పొరలుగా చక్కని పచ్చిక ఉంది.

పిచ్ క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ మాట్లాడుతూ

పిచ్ క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ మాట్లాడుతూ

ఇదే విషయాన్ని క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ తెలిపాడు. సాధ్యమైనంత వరకు ఫాస్ట్, బౌన్సీ పిచ్ తయారు చేయాలని తమకు ఆదేశాలు అందాయని సిప్‌థోర్ప్ అన్నాడు. "సాధ్యమైనంత బౌన్సీ, వేగవంతమైన పిచ్‌ రూపొందించాలని ఆదేశాలు అందాయి. అందుకే మాకు చేతనైనంత మేరకు అత్యంత బౌన్సీ పిచ్‌ను తయారుచేశాం" అని అన్నాడు.

నాలుగో రోజుల్లోనే 40 వికెట్లు పడ్డాయి

నాలుగో రోజుల్లోనే 40 వికెట్లు పడ్డాయి

"నవంబర్ నెలలో షెఫీల్డ్‌ షీల్డ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ కోసం రూపొందించిన తరహాలోనే పిచ్‌ను సిద్ధం చేశాం. ఆ మ్యాచ్‌లో పరుగులు ఎక్కువగా రాలేదు. నాలుగో రోజుల్లోనే 40 వికెట్లు పడ్డాయి. స్ఫిన్నర్ నాథన్ లయాన్ 120 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ 69 పరుగులకు ఒక వికెట్‌ పడగొట్టాడు" అని క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ అన్నాడు.

పిచ్‌పై వ్యతిరేకత రాలేదు

"మ్యాచ్‌ తర్వాత ఆటగాళ్ల స్పందన తెలుసుకున్నా. వ్యతిరేకత రాలేదు. ఆ మ్యాచ్‌లో మాదరిగానే పిచ్‌లో తేమ, వేగం, బౌన్స్‌ ఉండేలా చూశాం. పెర్త్‌లో ప్రస్తుతం బాగా ఎండకాస్తోంది. 38 డిగ్రీల ఎండలో ఒత్తిడిని తట్టుకొని ఆడటమే ఇక్కడ అసలైన సవాల్" అని బ్రెట్ సిప్‌థోర్ప్ చెప్పాడు. సాధారణంగా ఆస్ట్రేలియా పిచ్‌లలో పెర్త్ బౌన్స్‌కు పెట్టింది పేరు. ఈసారి దానిని మరింత బౌన్స్‌కు అనుకూలంగా మార్చడంతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష తప్పేలా కనిపించడం లేదు.

పెర్త్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:

అరోన్ ఫించ్, హారిస్, ఉస్మాన్ ఖవాజా, షాన్‌మార్ష్, హ్యాండ్స్‌కబ్, ట్రావిస్‌ హెడ్, టిమ్‌పైన్ (వికెట్ కీపర్, కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, హేజిల్‌వుడ్

Story first published: Thursday, December 13, 2018, 20:09 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X