న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ వార్నర్ ఏంటి ఆ నిర్లక్ష్యం.. అంత తొందర ఎందుకు నీకు.. మాజీ క్రికెటర్ల అసహనం!

India vs Australia: Mark Waugh Slams David Warner After He Gets Out Early in Sydney Test

సిడ్నీ: గాయం నుంచి కోలుకొని ఎన్నో అంచనాల మధ్య మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్రంగా నిరాశపరిచాడు. భారత్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్‌లో కేవలం 8 బంతులే ఆడిన వార్నర్(5) పేలవ షాట్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మహ్మద్ సిరాజ్ ఆఫ్ట్ స్టంప్‌కు దూరంగా వేసిన బంతిని వెంటాడి మరి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక వార్నర్ ఔటైన తీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

చాలా నిర్లక్ష్యంగా ఆడాడు..

చాలా నిర్లక్ష్యంగా ఆడాడు..

'వార్నర్‌ ఔటైన విధానం నాకు నచ్చలేదు. అత్యంత నిర్లక్ష్యంగా పేలవ షాట్ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్‌ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్‌కు బాగా తెలుసు... అయినా అనవరసంగా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకోవడం సరైంది కాదు'అని మార్క్‌వా అసహనం వ్యక్తం చేశాడు.

ఫిట్‌గా లేకున్నా ఆడించారా?

ఫిట్‌గా లేకున్నా ఆడించారా?

మరో మాజీ ఆటగాడు మైకెల్‌ హస్సీ కూడా వార్నర్‌ షాట్‌పై పెదవి విరిచాడు. 'వార్నర్‌ బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌ బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్‌ ఎంపికలో వార్నర్‌ పొరపాటు స్పష్టంగా తెలుస్తుంది. వికెట్ల మధ్య అతని పరుగుకు కూడా అతని శైలికి భిన్నంగా ఉంది. అతను పూర్తిగా కోలుకోకుంటే జట్టుకే ప్రమాదం'అని తెలిపాడు. ఇక టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్‌ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు అందుబాటులోకి రాలేకపోయాడు.

ఫిట్‌నెస్‌పై డౌట్

ఫిట్‌నెస్‌పై డౌట్

కానీ బ్యాటింగ్ బలహీనతో సతమతమవుతున్న ఆసీస్ ఆ సమస్యను అధిగమించేందుకు వార్నర్‌ను మూడో టెస్టుకు ఎంపిక చేసింది. అయితే వార్నర్‌ 100శాతం ఫిట్‌గా లేకున్నా క్రికెట్‌ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారనే విమర్శలు వినిపించాయి. తాజాగా వార్నర్‌ మూడో టెస్టులో త్వరగా ఔట్‌ కావడంతో మరోసారి అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్ (67) ‌, స్టీవ్‌ స్మిత్ (31) ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఫస్ట్ సెషన్ 7.1 ఓవర్ల ఆటనే సాధ్యమైంది.

Story first published: Thursday, January 7, 2021, 17:12 [IST]
Other articles published on Jan 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X