న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: ఆసీస్ 243 ఆలౌట్, భారత విజయ లక్ష్యం 287

India vs Australia 2nd Test Day 4: India In Trouble To Chase 287 For Win | Oneindia Telugu
India vs Australia Live Score, 2nd Test Day 4: Australia Bowled Out For 243, India Need 287 To Win

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేనకు నిర్దేశించింది.

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌‌కి కష్టంగా మారడం విశేషం. నాలుగో రోజైన సోమవారం ఆటలో భాగంగా ఆస్ట్రేలియా లంచ్‌ వరకూ కాస్త మెరుగ్గానే ఆడినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

ఆరు వికెట్లు తీసిన షమీ

ఆరు వికెట్లు తీసిన షమీ

భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీశాడు. 132/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖాజా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌లు నెమ్మదిగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

లంచ్‌ సమయం వరకూ వికెట్ పడలేదు

లంచ్‌ సమయం వరకూ వికెట్ పడలేదు

అదే క్రమంలో పరుగులపై కూడా దృష్టి సారించారు. దీంతో లంచ్‌ సమయం వరకూ టీమిండియా బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. ఆ తర్వాత పేసర్ షమీ రెచ్చిపోయి బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. టిమ్‌ పైన్‌(37), అరోన్‌ ఫించ్‌(25), ఉస్మాన్‌ ఖవాజా(72)లను కొద్ది పాటి వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపాడు.

 తొలి బంతికే ఆరోన్ ఫించ్ ఔట్

తొలి బంతికే ఆరోన్ ఫించ్ ఔట్

జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ (37) ఔటవగా.. ఆదివారం గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకున్న అరోన్ ఫించ్ (25) సోమవారం మళ్లీ బ్యాటింగ్‌కి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఉస్మాన్ ఖవాజా (72) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

వరుస బంతుల్లో పైన్‌, ఫించ్‌లను ఔట్ చేసిన షమీ

వరుస బంతుల్లో పైన్‌, ఫించ్‌లను ఔట్ చేసిన షమీ

పైన్‌, ఫించ్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన షమీ.. మరో మూడు ఓవర్లలోపే ఉస్మాన్ ఖవాజాను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. గుడ్‌ లెంగ్త్‌, బౌన్సర్లు, అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతులతో షమీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బూమ్రా బౌలింగ్‌లో కమిన్స్‌(1) ఔట్‌ కావడంతో ఆసీస్‌ 198 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది.

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్

192 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్‌.. 198 పరుగుల వద్ద మరో రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇక చివరి రెండు వికెట్లలో షమీ, బూమ్రాలు తలో వికెట్‌ సాధించడంతో ఆస్ట్రేలియా 243 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి వికెట్‌కు స్టార్క్‌(14)- హెజెల్‌వుడ్‌(17 నాటౌట్‌)ల జోడి 36 పరుగులు జోడించారు.

భారత విజయ లక్ష్యం 287

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే 241 ఆధిక్యంలో ఆ జట్టు ఉంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు 283 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్‌కి 43 పరుగుల ఆధిక్యం లభించింది. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

1
43624
Story first published: Monday, December 17, 2018, 12:30 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X