న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: స్టార్క్ బౌలింగ్‌లో పుజారా ఔట్, కోహ్లీ హాఫ్ సెంచరీ

India vs Australia Live Score, 2nd Test Day 2: Virat Kohli Fifty Keeps Indias Fight On In Perth

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టీ విరామానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ఆటలో రెండో రోజైన శనివారం 277/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటైంది. అనంతరం భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది.

మూడో ఓవర్‌లోనే మురళీ విజయ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని మిచెల్ స్టార్క్ బంతిని విసరగా మురళీ విజయ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) పరుగులకే ఔటై నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది.

పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ క్లీన్‌బౌల్డ్: మండిపడుతోన్న ఫ్యాన్స్ (వీడియో)పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ క్లీన్‌బౌల్డ్: మండిపడుతోన్న ఫ్యాన్స్ (వీడియో)

టీ విరామ సమయానికి భారత్ 70/2

ఆ తర్వాత క్రీజులో వచ్చిన పుజారా(24), విరాట్ కోహ్లీ(41) భారత్‌ను ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. పుజారా నెమ్మదిగా ఆడుతున్నప్పటికీ... కోహ్లీ మాత్రం చెత్త బంతులకు పరుగులు రాబడుతున్నాడు. దీంతో టీ విరామ సమయానికి వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మూడో వికెట్ కోల్పోయిన భారత్

మూడో వికెట్ కోల్పోయిన భారత్

అయితే, టీ విరామం అనంతరం భారత జట్టు పుజారా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి పుజారా (24) టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి రహానే వచ్చాడు. రహానేతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ని ముందుండి నడిపిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

జట్టు స్కోరు 8/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ109 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ కాగా అతని ఖాతాలో 24 సెంచరీలు ఉండటం విశేషం. ప్రస్తుతం 47 ఓవర్ల ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.

 326 పరుగులకి ఆలాటైన ఆస్ట్రేలియా

326 పరుగులకి ఆలాటైన ఆస్ట్రేలియా

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకి ఆలాటైంది. ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 277/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో టిమ్ పైన్ (38), పాట్ కమిన్స్ (19) క్రీజులో నిలిచి ఓ గంటపాటు భారత్ బౌలర్లని పరీక్షించారు. జట్టు స్కోరు 310 వద్ద పాట్ కమిన్స్‌ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. తర్వాత ఓవర్‌లోనే టిమ్‌పైన్‌ని బుమ్రా బోల్తా కొట్టించాడు.

స్టార్క్ బౌలింగ్‌లో ఔటైన పుజారా

స్టార్క్ బౌలింగ్‌లో ఔటైన పుజారా

ఆ తర్వాత మిచెల్ స్టార్క్ (6), జోష్ హేజిల్‌వుడ్ (0)‌లను వరుస బంతుల్లో ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుజారా (24) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

1
43624
Story first published: Saturday, December 15, 2018, 14:25 [IST]
Other articles published on Dec 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X