న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: ఆదిలోనే ఎదురుదెబ్బ, ఓపెనర్లను కోల్పోయిన భారత్

India vs Australia 2nd Test : India Lose Openers Early, Australia In Command | Oneindia Telugu
India vs Australia Live Score, 2nd Test Day 2: India Lose Openers Early, Australia In Command

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత ఓపెనర్ మురళీ విజయ్ తడబాటు కొనసాగుతోంది. దీంతో ఆరు పరుగులకే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ మరోసారి నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో విఫలమైన మురళీ విజయ్ తాజాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనే మురళీ విజయ్ ఔటవడం గమనార్హం.

పెర్త్‌లో రెండో టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 ఆలౌట్పెర్త్‌లో రెండో టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 ఆలౌట్

మూడో ఓవర్‌లోనే మురళీ విజయ్ ఔట్

ఆటలో రెండో రోజైన శనివారం 277/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటైంది. అనంతరం భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే మురళీ విజయ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని మిచెల్ స్టార్క్ బంతిని విసరగా మురళీ విజయ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

జట్టులో ప్రశ్నార్థకంగా మారిన మురళీ విజయ్ స్థానం

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మురళీ విజయ్(11, 18) పరుగులతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పెర్త్ టెస్టులో మరీ పేలవంగా బౌల్డ్ కావడంతో జట్టులో అతని స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్ పర్యటలోనూ తొలి రెండు టెస్టుల్లో అతను విఫలం కావడంతో ఆ తర్వాత మూడు టెస్టుల్లోనూ అతడిపై వేటు పడిన సంగతి తెలిసిందే.

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఆ తర్వాత కొద్ది సేపటికే భారత్‌ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ రాహుల్ పేసర్ హజెల్‌ఉడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా విఫలమవుతున్న రాహుల్‌.. తన చివరి పది ఇన్నింగ్స్‌ల్లో ఆరు సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు గాను భారత్ 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. పుజారా 11, కోహ్లీ 19 పరుగులుతో క్రీజులో ఉన్నారు.

Story first published: Saturday, December 15, 2018, 11:31 [IST]
Other articles published on Dec 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X