ఒకే ప్రాంతం నుంచి వచ్చాం.. ఒకరిపై ఒకరికి అవగాహన ఉంది: మురళీ విజయ్

India vs Australia 1st Test : Gates Opened For Murali Vijay As Opener | Oneindia Telugu
India vs Australia: KL Rahul is a good guy to bat with, he is fun - Murali Vijay

సిడ్నీ: తొలి టెస్టుకు కేఎల్ రాహుల్‌తో పాటుగా పృథ్వీ షా ఉంటే ఇన్నింగ్స్ శుభారంభం జరుగుతుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా పృథ్వీ షా కాలికి గాయం అవడంతో జట్టు అయోమయంలో పడింది. మరో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ను తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో సతమతమవుతుండగానే వార్మప్ మ్యాచ్‌లో విజయ్ విజృంభించి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఆదివారం ముగిసిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సత్తా చాటాడు.

 దాదాపు ఓపెనర్ స్థానం ఖాయమైనట్లుగానే

దాదాపు ఓపెనర్ స్థానం ఖాయమైనట్లుగానే

ఈ సెంచరీకి మించిన ఇన్నింగ్స్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజయ్‌ దాదాపు ఓపెనర్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పృథ్వీ స్థానంలో వచ్చిన విజయ్‌కి రాహుల్‌ తోడవడంతో చక్కటి భాగస్వామ్యం నెలకొంది. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై విజయ్‌ ఇలా మాట్లాడాడు. ‘మేం ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లం. అందువల్ల ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఉంది. అతను మంచి వ్యక్తి. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడూ సరదాగా ఉంటుంది. మొదటి టెస్టులోనూ ఇదే ఫాం కొనసాగిస్తామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.

 రాహుల్‌, విజయ్‌ టెస్టుల్లో కలిసి 25 సార్లు

రాహుల్‌, విజయ్‌ టెస్టుల్లో కలిసి 25 సార్లు

గతంలో రాహుల్‌, విజయ్‌ టెస్టుల్లో 25 సార్లు కలిసి బ్యాటింగ్‌ చేశారు. మొదటి టెస్టు జరగనున్న అడిలైడ్‌లో నాలుగేళ్ల క్రితం విజయ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో 53, 99 పరుగులతో రాణించాడు. దాంతో పాటుగా ఆస్ట్రేలియాలో బ్యాటింగ్‌ చేయడం అంటే ఇష్టమని విజయ్‌ తెలిపాడు. తను బ్యాక్‌ ఫుట్‌పై ఎక్కువగా ఆడతానని, ఇక్కడి పరిస్థితులు తనకు సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నాడు. 2014 పర్యటనలోనూ విజయ్‌ 400కిపైగా పరుగులతో రాణించిన విషయం తెలిసిందే.

27 బంతుల్లోనే రెండో హాఫ్ సెంచరీ

27 బంతుల్లోనే రెండో హాఫ్ సెంచరీ

వార్మప్ మ్యాచ్‌లో 91 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విజయ్‌.. తర్వాత రెచ్చిపోయి ఆడాడు. 27 బంతుల్లోనే రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. జేక్‌ కార్డర్‌ వేసిన ఒక ఓవర్లో అతను ఏకంగా 26 పరుగులు సాధించాడు. 38వ ఓవర్‌ ముగిసేసరికి 74 పరుగులతో ఉన్న విజయ్‌.. కార్డర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి చేయడం విశేషం.

రాహుల్ కూడా పరవాలేదనిపించడంతో

రాహుల్ కూడా పరవాలేదనిపించడంతో

ఈ దశలో మరో ఓపెనర్‌ రాహుల్‌తో అతను తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించాడు. నిలకడ లేమికి మారు పేరుగా మారిన రాహుల్‌ కూడా ఈసారి సాధికారికంగా ఆడాడు. చక్కటి షాట్లతో అలరించాడు. అతను 78 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడు కనబరచిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోగలిగింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Sunday, December 2, 2018, 14:20 [IST]
    Other articles published on Dec 2, 2018
    POLLS

    Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more