న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ విషయంలో పిల్లికూనల్లా వ్యవహారించొద్దు: ఆసీస్‌ ప్లేయర్లకు మాజీ కెప్టెన్

India Vs Australia: Kim Hughes suggests Australians not to play like pussycats against Virat Kohli

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని డీల్ చేసే విధానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పిల్లికూనల్లా వ్యవహారించాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం కిమ్ హ్యూస్ అన్నాడు.

బుధవారం గబ్బా వేదికగా తొలి టీ20

బుధవారం గబ్బా వేదికగా తొలి టీ20

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 బుధవారం జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కిమ్ హ్యూస్ మాట్లాడాడు.

కోహ్లీ పట్ల పిల్లికూనల్లా వ్యవహారించొద్దు

కోహ్లీ పట్ల పిల్లికూనల్లా వ్యవహారించొద్దు

"కోహ్లీ పట్ల పిల్లికూనల్లా వ్యవహారించొద్దు. అతనికి (కోహ్లీ) జాతిపరంగా విడదీయడం చేస్తే, అదే తదేకంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సాధారణ ఆటను ఆడితే చాలు. కోహ్లీ గనుకు ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కాకపోయి ఉంటే చివరి ఇద్దరు లేదా ముగ్గురిలో ఉండేవాడు" అని అన్నాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు

"నాకు తెలిసి అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. కోహ్లీసేన అద్భుతంగా రాణించాలని మీరు 1.2 బిలియన్ ప్రజల మద్దతు తెలుపుతుంటే, ఒత్తిడి ఉండటం సహజం. ప్రత్యర్ధి జట్టుగా అతడు అలాంటి ఒత్తిడిలో ఉన్నాడనే విషయాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రహించాలి" అని కిమ్ హ్యూస్ అన్నాడు.

కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తేనే

కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తేనే

"కోహ్లీని ఒత్తిడికి గురిచేసినప్పుడు మీకు అవకాశం ఉంది. కొంతమంది ఆటగాళ్లు ఒత్తిడికి గురైనప్పటికీ, తమలోని అత్యుత్తమ ఆటను వెలికితీస్తారు. అందుకు ఉదాహరణ క్లైవ్ లాయిడ్. అయితే, ఈ పర్యటనలో కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే మ్యాచ్ ఫలితం మీకు అనుకూలంగా మారొచ్చు. అలా అతడిపై మీరు ఒత్తిడిని పెంచతూనే ఉండాలి" అని హ్యూస్ తెలిపాడు.

Story first published: Wednesday, November 21, 2018, 12:35 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X