న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: భారత్‌దే బ్యాటింగ్.. కామెరూన్ గ్రీన్ అరంగేట్రం!

India opt to bat, Wade and Burns in for Australia

అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌‌లో ఓడి.. టీ20ల్లో గెలిచిన భారత జట్టు‌ అసలు పోరాటానికి సిద్ధమైంది. టూర్‌‌ మొదలైనప్పట్నించి హెడ్‌‌లైన్స్‌‌లో నిలుస్తున్న 'డే/నైట్‌‌' టెస్ట్‌‌ మొదలైంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ ఫస్ట్ డేనైట్ టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు.

మ్యాచ్ గెలవాలంటే పరుగులు చేయడం చాలా ముఖ్యమని చెప్పాడు. తమ ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారని, ప్రణాళికలకు అనుగుణంగా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కంకషన్ గాయానికి గురైన కామెరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. జో బర్న్స్‌తో కలిసి మాథ్యూవేడ్ ఓపెనింగ్ చేయనున్నాని ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ తెలిపాడు.

పేపరుమీద చూడటానికి ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. రెండింటిలోనూ టాప్‌‌ ఆర్డర్‌‌ సమస్యలు ఉన్నాయి. అయితే వీటిని ఎంతమేరకు పరిష్కరించుకుంటాయన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌‌ ద్వారా డే/నైట్‌‌ టెస్ట్‌‌లకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తుంటే.. క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ మాత్రం కోహ్లీ వర్సెస్‌‌ స్మిత్‌‌ రైవలరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఓవరాల్‌‌గా రెండేళ్ల కిందట సిరీస్‌‌ గెలిచిన టీమిండియా.. దానిని నిలబెట్టుకోవాలని పక్కా ప్లాన్స్‌‌ వేస్తుండటం, ఈ మ్యాచ్‌‌ తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో పింక్‌‌ టెస్ట్‌‌పై చాలా హైప్‌‌ క్రియేట్‌‌ అయ్యింది. దీంతో తెలియని ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరుజట్లు ఎలా ఆడతాయన్నదే ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు:
భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్దిమాన్ సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా.
ఆస్ట్రేలియా : పైన్‌ (కెప్టెన్‌), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.

Story first published: Thursday, December 17, 2020, 9:27 [IST]
Other articles published on Dec 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X