న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టుకు టీమిండియా ఎంపిక: రాహుల్‌కి మ‌రో ఛాన్స్, అశ్విన్‌పై డౌట్!

Ind vs Aus 4th Test :India Name 13-Man Squad For Sydney Test
India vs Australia: India Name 13-Man Squad For Sydney Test, Ravichandran Ashwin Doubtful

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే చివరి టెస్టుకు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఆఖరి టెస్టులో విజయం సాధించి ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను గెలవాలని ఊవిళ్లూరుతోంది.

2-1 ఆధిక్యంలో టీమిండియా

2-1 ఆధిక్యంలో టీమిండియా

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్టుని డ్రా చేసుకున్నా కూడా సిరీస్ భార‌త సొంతం అవుతుంది. అయితే కీలక ఆటగాళ్ల గైర్హాజరీ, అందుబాటులో ఉన్నవారు సరైన ఫామ్‌లో లేకపోవడంతో.. తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుంద‌న్న దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

'బుమ్రాను ఎదుర్కోవడం ఓ పీడకలే... ఇరుజట్ల మధ్య తేడా పుజారానే'

 కేఎల్ రాహుల్‌కి మ‌రో అవకాశం

కేఎల్ రాహుల్‌కి మ‌రో అవకాశం

ఈ సిరిస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి మ‌రో అవకాశం ఇవ్వ‌గా, సిడ్నీ టెస్టు నుంచి ముర‌ళీ విజ‌య్‌ని జట్టు మేనేజ్‌మెంట్ త‌ప్పించింది. మరోవైపు రోహిత్ శర్మ భార్య రితికా ఆదివారం పండంటి పాపకు జన్మనివ్వడంతో స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు.

వన్డే సిరిస్‌కు అందుబాటులో రోహిత్ శర్మ

జనవరి 12 నుంచి జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఇక, చివ‌రి మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ‌ని త‌ప్పించి ఉమేష్ యాద‌వ్‌కి జట్టు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. ఇక, స్పిన్ విభాగంలో జ‌డేశా, అశ్విన్‌, కుల్దీప్ యాద‌వ్‌ల‌ని ఎంపిక చేయ‌గా వీరిలో ఒక‌రు మాత్ర‌మే తుది జ‌ట్టులో ఉంటారు.

కొత్త ఏడాది కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా?

కొత్త ఏడాది కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా?

ఇక, క‌డుపు నొప్పితో కొద్ది రోజులుగా బాధ‌ప‌డుతున్న అశ్విన్ చివ‌రి రెండు టెస్ట్‌లకి అందుబాటులో లేడు. మ‌రి నాలుగో టెస్ట్ ఆడ‌తాడా లేదా అనేది గురువారం ఉద‌యం మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణ‌యిస్తామ‌ని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది. కొత్త ఏడాదిలో టీమిండియా చ‌రిత్ర సృష్టిస్తుందా లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1
43626
Story first published: Wednesday, January 2, 2019, 11:01 [IST]
Other articles published on Jan 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X