న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రాను ఎదుర్కోవడం ఓ పీడకలే... ఇరుజట్ల మధ్య తేడా పుజారానే'

India vs Australia: 'Jasprit Bumrah Is A Nightmare To Face' Says Brad Hodge
Bumrah is nightmare to face but Pujaras runs made vital difference: Hodge

హైదరాబాద్: టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఒక పీడ కలేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌హడ్జ్‌‌ అన్నాడు. బౌలింగ్‌లో ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నా.. రెండు జట్ల మధ్య తేడా మూడో స్థానంలో ఆడుతున్న ఛటేశ్వర్‌ పుజారానే ప్రధాన వ్యత్యాసమని పేర్కొన్నాడు.

ఫిట్‌గా లేడు: సిడ్నీ టెస్టుకు అశ్విన్ దూరమే!ఫిట్‌గా లేడు: సిడ్నీ టెస్టుకు అశ్విన్ దూరమే!

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. చివరి మ్యాచ్‌ గెలిచి 3-1తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది.

1
43626
 టెస్టు మ్యాచ్‌ బౌలర్ల నుంచి ఏది కోరుకుంటామో

టెస్టు మ్యాచ్‌ బౌలర్ల నుంచి ఏది కోరుకుంటామో

మరోవైపు చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను డ్రా చేయాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్‌ బౌలర్ల నుంచి ఏది కోరుకుంటామో.. అవన్నీ బుమ్రాలో పుష్కలంగా ఉన్నాయని బ్రాడ్‌హడ్జ్‌ చెప్పాడు. బ్రాడ్‌ హడ్జ్‌ మాట్లాడుతూ "రెండు జట్ల మధ్య తేడా పుజారా. రెండు జట్ల బౌలింగ్‌ దళాలు పటిష్టంగా ఉన్నాయి. మెల్‌బోర్న్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను మినహాయిస్తే ఓపెనర్లు అందరూ విఫలమయ్యారు" అని అన్నాడు.

మూడో స్థానంలో ఆడిన పుజారా చాలా కీలకం

మూడో స్థానంలో ఆడిన పుజారా చాలా కీలకం

"అందుకే మూడో స్థానంలో ఆడిన పుజారా చాలా కీలకం. అతడు అస్సలు చెత్తగా ఔటవ్వలేదు. ఆటపై పట్టు సాధించేందుకు సమయం తీసుకున్నాడు. పెర్త్‌, అడిలైడ్‌లో నాథన్ లయాన్ విజృంభించాడు. అతడిని ఎదుర్కొన్న పుజారా ప్రాముఖ్యం తక్కువ చేయలేం. అతడు ఆడటంతోనే తొలి టెస్టులో టీమిండియా పుంజుకుంది" అని హడ్జ్‌ పేర్కొన్నాడు.

 బుమ్రా బంతులను ఎదుర్కోవడం ఓ పీడకలే

బుమ్రా బంతులను ఎదుర్కోవడం ఓ పీడకలే

"బుమ్రా బంతులను ఎదుర్కోవడం ఒక పీడకలే. ఏ బ్యాట్స్‌మన్‌ను అడిగినా, వామ్మో అనే అంటారు. వేగం, కచ్చితత్వంతోపాటు వికెట్‌కు ఇరువైపులా బంతిని తిప్పగలడు. టెస్టు బౌలర్‌కు ఉండాల్సిన లక్షణమిదే. అతడికి ఎకానమీ, స్ట్రైక్‌రేట్‌ను అప్పుడే కపిల్‌దేవ్‌తో పోలుస్తున్నారు. కేవలం 12 నెలల్లోనే అతడితో పోలుస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు" అని అన్నాడు.

గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది

గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది

"భారత బౌలింగ్‌ దళం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. బుమ్రా, ఇషాంత్‌, షమి అద్భుతంగా రాణిస్తున్నారు" అని బ్రాడ్‌హడ్జ్‌ అన్నాడు. టీమిండియా సిరీస్‌ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హాడ్జ్‌ చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, January 2, 2019, 9:20 [IST]
Other articles published on Jan 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X