
జట్టు మొత్తం చేసిన పరుగుల్లో దాదాపు 40 శాతం
గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియా జట్టు మొత్తం చేసిన పరుగుల్లో దాదాపు 40 శాతం పరుగులు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లే చేశారని.. ఇప్పుడు వారు లేకపోవడంతో ఆసీస్ బలహీనంగా కనిపిస్తోందని డీన్‌జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా డీన్ జోన్స్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా జట్టుని సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. ప్రస్తుతం టీమ్‌లో స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేరు" అని అన్నాడు.

స్మిత్, వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం
"స్మిత్, వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లూ ప్రస్తుతం జట్టులో ఉండారని నేను అనుకోవట్లేదు. మరోవైపు భారత్ కెప్టెన్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ప్రత్యర్ధి జట్లను రెచ్చగొట్టడం కంటే.. అతని బలహీతనలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిరిస్ ఆరంభం నుంచే కోహ్లీ కవర్ డ్రైవ్స్‌ని నిలువరించాలి" అని డీన్‌జోన్స్ సూచించాడు.

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసురుతూ
"ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసురుతూ.. తొలుత అతను బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువగా ఆడేలా చేయాలి. అలా అతడ్ని వెనక్కి తగ్గేలా చేస్తూ ఆఫ్ సైడ్‌లో వైడ్ రూపంలోనూ అప్పుడప్పుడు బంతులు విసిరాలి. స్లిప్ లేదా గల్లీలో ఫీల్డర్‌కి కోహ్లీ చిక్కే అవకాశం ఉంటుంది" అని డీన్ జోన్స్ పేర్కొన్నాడు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా ఇప్పటికే సెలక్టర్లు జట్టుని ప్రకటించారు.

వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డ పృథ్వీషా
మరోవైపు, ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీషా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో అతడు నొప్పితోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షా.. ఆసీస్ ఓపెనర్ మాక్స్ బ్రయాంట్ కొట్టిన షాట్‌ను క్యాచ్ పడుతుండగా ఎడమ కాలి మడమకు గాయమైంది.

డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు
దీంతో పృథ్వీ షా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరగనున్న తొలి టెస్టులో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. "బౌండరీ వద్ద క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో షా ఎడమ కాలి మడమకు గాయమైంది. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. గాయం తీవ్రతపై స్కానింగ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

టెస్టు జట్టు
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్