న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: హాట్‌స్టార్ కాకుండా... ఫ్రీగా ఎలా చూడాలంటే?

 India vs Australia: How to watch Border Gavaskar Trophy for free, Live streaming info

హైదరాబాద్: వైట్‌బాల్ క్రికెట్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా.. అసలు సిసలు రెడ్ బాల్ క్రికెట్‌కు రెడీ అయ్యింది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌‌తో ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌ల్లో సన్నాహకాలు చేస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ గెలవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మరోవైపు 2004 నుంచి భారత్ గడ్డపై టెస్ట్‌ల్లో విజయాన్ని అందుకోలేకపోతున్న ఆస్ట్రేలియా.. ఈసారి ఎలాగైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

షెడ్యూల్, టైమింగ్స్..

షెడ్యూల్, టైమింగ్స్..

నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ గురువారం (జనవరి 9) నుంచి సోమవారం(జనవరి 13) వరకు నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరగనుండగా.. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ధర్మశాల వేదికగా జరగనుంది. మార్చి 9 నుంచి మార్చి 13 వరకు జరగనున్న నాలుగో టెస్ట్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల అభిమానులు ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నారు. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

 ఏ చానెల్‌లో వస్తుందంటే..?

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

సొంతగడ్డపై జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌‌లకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ చానెల్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెట్ వర్క్‌కు చెందిన స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మళయాళం, తమిళం తదితర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్థానిక భాషల్లో కామెంట్రీ లభించనుంది. స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్‌లు ఆయా భాషల్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

ఫ్రీగా చూడాలంటే..?

ఫ్రీగా చూడాలంటే..?

స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలంటే జియో, వోడాఫోన్, ఎయిర్టెల్ కస్టమర్లు ప్రత్యేక ప్లాన్ రిచార్జ్‌తో ఫ్రీగా చూడవచ్చు. జియో సిమ్ ఉన్నవారు జియో టీవీ యాప్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్‌లు వీక్షించవచ్చు. జియో టీవీ యాప్‌లోని సెర్చ్‌బార్‌లో స్టార్ స్పోర్ట్స్ చానెల్‌ను సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. ఎయిర్టెల్ కస్టమర్లు అయితే ఎయిర్టెల్ టీవీ యాప్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు. టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటే భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ మ్యాచ్‌లన్నీ డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నాయి.

ఇరు జట్లు:

ఇరు జట్లు:

తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్(కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హాండ్‌స్కోంబ్, జోష్ హజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, లాన్స్ మోర్రీస్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్

Story first published: Saturday, February 4, 2023, 16:14 [IST]
Other articles published on Feb 4, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X