న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్రలో తొలిసారి, ఆసీస్‌పై భారీ తేడాతో భారత్ గెలుపు

India vs Australia 2018 Highlights 1st Test: India Beat Australia By 31 Runs, Take 1-0 Series Lead
India vs Australia Highlights, 1st Test Day 5: India Beat Australia By 31 Runs, Take 1-0 Series Lead

న్యూ ఢిల్లీ: ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టుల్లో శుభారంభాన్ని నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆరంభించిన టీమిండియా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్‌లో ఘనమైన బోణి అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా (3/60), మహ్మద్ షమీ (3/65) ధాటికి 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 291 పరుగులకే చేతులెత్తేసింది.

చరిత్రలో ఇదే తొలిసారి కావడం

చరిత్రలో ఇదే తొలిసారి కావడం

ఆసీస్ జట్టులో షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ భారత్ జట్టు గెలుపొందడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటవగా.. ఆస్ట్రేలియా జట్టు 235కే కుప్పకూలిపోయింది. దీంతో.. 15 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకి ఆలౌటైంది.

323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో

323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో

ఆదివారం ఆల్ అవుట్‌గా ముగించిన టీమిండియా.. కంగారూలకి 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్(2/44), మహ్మద్ షమీ(2/15) దెబ్బకు.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్ 104/4తో కష్టాల్లో పడింది. మూడో రోజు వర్షం కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి నాలుగో రోజు అరగంట ముందే ఆటను ప్రారంభించారు. పుజారా, రహానేలు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.

 ఓవర్‌నైట్ స్కోరు 104/4తో రెండో ఇన్నింగ్స్‌

ఓవర్‌నైట్ స్కోరు 104/4తో రెండో ఇన్నింగ్స్‌

సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి మొదలవనుంది. ఓవర్‌నైట్ స్కోరు 104/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి సెషన్‌లోనే ట్రావిస్ హెడ్ (14) వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టిమ్‌పైన్ (41: 73 బంతుల్లో 4ఫోర్లు)‌తో కలిసి నెమ్మదిగా ఆడిన షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5ఫోర్లు) భారత్ శిబిరంలో కంగారు రేకెత్తించాడు.

భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఆస్ట్రేలియా

భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఆస్ట్రేలియా

ఈ ఇద్దరినీ.. తెలివైన బంతులతో బోల్తా కొట్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. ఆఖర్లో మాత్రం మిచెల్ స్టార్క్ (28: 44 బంతుల్లో 2ఫోర్లు), పాట్ కమిన్స్ (28: 121 బంతుల్లో 3ఫోర్లు), నాథన్ లైన్ (38 నాటౌట్: 47 బంతుల్లో 3ఫోర్లు) భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఆస్ట్రేలియా జట్టులో ఆశలు రేపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో జట్టు స్కోరు 291 వద్ద అశ్విన్ వారి గెలుపు ఆశలకి చెక్ చెప్పాడు.

1
43623
Story first published: Monday, December 10, 2018, 11:22 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X