న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌లో కోపాన్ని చూశా.. కానీ, ధోనిలో ఇంతవరకు కనిపించలేదు: శాస్త్రి

Ravi Shastri Says 'Have Seen Sachin Get Angry But Not MS Dhoni | Oneindia Telugu
India vs Australia: Have seen Sachin Tendulkar get angry but not MS Dhoni, says Ravi Shastri

హైదరాబాద్: 'ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు' అని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ధోని లాంటి ఆటగాడు 30, 40 ఏళ్లకు ఒకసారి కనిపిస్తారని... ధోని స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేదని రవిశాస్త్రి వెల్లడించాడు.

మలేసియా ఓపెన్: మారిన్ చేతిలో ఓడిన సైనా, టోర్నీ నుంచి నిష్క్రమణమలేసియా ఓపెన్: మారిన్ చేతిలో ఓడిన సైనా, టోర్నీ నుంచి నిష్క్రమణ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని... భారత క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తాడని కొనియాడాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ధోని గురించి రవిశాస్త్రి మాట్లాడతూ "అతనో దిగ్గజం. గొప్ప క్రికెటర్ల జాబితాలో నిలిచిపోతాడు. ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు" అని అన్నాడు.

30-40 సంవత్సరాలకు ఒకరే వస్తారు

30-40 సంవత్సరాలకు ఒకరే వస్తారు

ధోని లాంటి ఆటగాళ్లు 30-40 సంవత్సరాలకు ఒకరే వస్తారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ లోటు పూడ్చడం కష్టం. బ్యాట్స్‌మన్‌గానే కాదు... మంచి వ్యూహకర్తగా కెప్టెన్‌ కోహ్లిపై భారం తగ్గిస్తాడు. కీపర్‌గా ఆటను అతడు చూసే కోణం వేరు. కుర్రాళ్లతో బాగా ఉంటాడు. పంత్‌ మరో ధోనీగా అవతరిస్తే చాలా బాగుంటుంది. అతడిలో గొప్ప ప్రతిభ దాగుంది" అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ధోని జాగ్రత్తగా ఆటను గమనిస్తాడు

ధోని జాగ్రత్తగా ఆటను గమనిస్తాడు

"రోజు అతడు ధోనితో మాట్లాడతాడు. టెస్టు సిరీస్‌ సమయంలో ధోనీ కన్నా ఎక్కువగా ఎవరితో మాట్లాడలేదు. ఆటను ధోని జాగ్రత్తగా గమనిస్తాడు. వ్యూహాలు పన్నుతాడు. పదేళ్లు అతడు జట్టుకు నాయకత్వం వహించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వారంతా ధోనిని గొప్పగా చూస్తారు. ఈ మొత్తం జట్టు అతడి సారథ్యంలోనే రూపుదిద్దుకుంది. ఓడినా, గెలిచినా, డకౌటైనా శతకం చేసిన మహీ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు" అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

ధోని స్థానాన్ని భర్తీ చేయడం కష్టం

ధోని స్థానాన్ని భర్తీ చేయడం కష్టం

"ధోని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. 2011 నుంచి అతనొక్క ఇంటర్వ్యూ సైతం ఇవ్వలేదంటేనే అద్భుతం. అందుకని భారతీయులకు నేను ఒకటే చెబుతున్నా. ధోని ఆడినంత కాలం ఆస్వాదించండి" అని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ధోని వరుసగా 51, 55, 87 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

విమర్శలపై రవిశాస్త్రి ఇలా

విమర్శలపై రవిశాస్త్రి ఇలా

ఇక, భారత జట్టు ప్రదర్శనపై వస్తోన్న విమర్శలపై రవిశాస్త్రి మాట్లాడుతూ "నిర్ణయాత్మక విమర్శలను నేను స్వీకరిస్తా. కానీ, పనిగట్టుకుని చేశారని అనిపిస్తే మాత్రం అవతలివారు గొప్పవారా? సాధారణ వ్యక్తా? అన్నది కూడా చూడను. వారికి తగిన రీతిలో బదులిస్తా. దీనిపై నా పంథా మారదు" అని పేర్కొన్నాడు.

సచిన్, కోహ్లీల్లో పోలికలపై

సచిన్, కోహ్లీల్లో పోలికలపై

"సచిన్, కోహ్లీల్లో మీరు గమనించిన పోలికలేమిటని నిన్న ఎవరో అడిగారు. పరుగుల కోసం తాపత్రయం, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, ఎక్కడా రాజీ పడకపోవడం, ఇతరుల లోపాలను ఎత్తిచూపకపోవడం, తప్పులను అంగీకరించడం.. ఇలా చాలా ఉన్నాయి. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయని వివ్ రిచర్డ్స్‌ లాగా కోహ్లీ బ్యాటింగ్‌లో దూకుడెక్కువ. ఎంత ఎదిగినా పరిమితుల్లో ఉంటాడు" అని రవిశాస్త్రి అన్నాడు.

Story first published: Saturday, January 19, 2019, 14:14 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X