న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మురళీ విజయ్ సెంచరీ, కోహ్లీకి వికెట్: ఆసీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ డ్రా

India vs Cricket Australia XI Highlights : Murali Vijay Slams Ton & Practice Match Ends in a Draw
India vs Australia: From 52 off 91 balls to 100 off 118 – Murali Vijay goes berserk in warm-up clash

హైదరాబాద్: సిడ్నీ వేదికగా టీమిండియా, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన నాలుగురోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం చివరి రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా 43.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.

సిడ్నీలో వార్మప్ మ్యాచ్: వికెట్ తీసిన ఆనందంలో కోహ్లీ (వీడియో)సిడ్నీలో వార్మప్ మ్యాచ్: వికెట్ తీసిన ఆనందంలో కోహ్లీ (వీడియో)

శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన తర్వాత హాఫ్‌ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్‌(62) ఔటయ్యాడు. ఆ తర్వాత హనుమ విహారీతో కలిసి విజయ్‌ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

వార్మప్ మ్యాచ్‌లో మురళీ విజయ సెంచరీ

ఈ క్రమంలో మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. టీ20 మాదిరి దూకుడుగా ఆడిన మురళీ విజయ్ తొలి హాఫ్‌ సెంచరీ సాధించడానికి 91 బంతులు తీసుకోగా... ఆ తర్వాత మరింతగా రెచ‍్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి కేవలం 27 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మొత్తం 132 బంతులను ఎదుర్కొన్న విజయ్‌ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.

39వ ఓవర్‌లో 26 పరుగులు రాబట్టిన మురళీ విజయ్

39వ ఓవర్‌లో మురళీ విజృంభించాడు. ఆసీస్ బౌలర్ జేక్ కార్డర్ వేసిన ఈ ఓవర్‌లో మురళీ విజయ్ బౌండరీలతో చెలరేగాడు. రెండు సిక్సులు, మూడు బౌండరీలతో 26 పరుగులు రాబట్టాడు. 44వ ఓవర్‌లో మురళీ విజయ్‌ ఔటైన తర్వాత మ్యాచ్‌ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసి ఆలౌటైన ఆస్ట్రేలియా ఎలెవన్

అనంతరం, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసి ఆలౌటైంది. హ్యారీ నీల్సన్‌(100) సెంచరీతో రాణించగా, షార్ట్‌ ( 74), మ్యాక్స్‌ బ్రయాంట్‌ ( 62), అరోన్‌ హార్డీ(86)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ తీశాడు.

వార్మప్ మ్యాచ్‌‌లో వికెట్ తీసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

శనివారం సౌత్‌ ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హ్యారీ నీల్సన్‌ను ఔట్‌ చేశాడు. 170 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జోరుమీదున్న హరీ నీల్సన్‌ వికెట్‌ తీయడం విశేషం. కోహ్లీ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. వికెట్‌ తీసిన అనంతరం తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ "కెప్టెన్ వికెట్‌ తీసిన వేళ" అంటూ క్యాష్షన్ పెట్టింది.

Story first published: Saturday, December 1, 2018, 13:53 [IST]
Other articles published on Dec 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X