న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పచ్చికను చూసి భయపడొద్దు, పగుళ్లు రాకపోవచ్చు'

 India vs Australia: Don’t get fooled by grass on MCG pitch, says Marcus Harris

మెల్‌బోర్న్‌: తొలి టెస్టు విజయం తర్వాత భారీ అంచనాలతో దిగిన ఇరు జట్లకు పచ్చికతో కూడిన పెర్త్ వేదిక కఠిన సవాళ్లను ఇచ్చింది. ఈ హోరాహోరీ సమరంలో ఆస్ట్రేలియా పైచేయి సాధించడంతో జట్టు ఎంపికలో పొరబాట్లు కారణంగా కోహ్లీసేన పరాజయాన్ని రుచి చూడాల్సి వచ్చింది. డిసెంబరు 26న జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు మెల్‌బౌర్న్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అయితే పెర్త్ పిచ్‌పై పచ్చికతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మూడో టెస్టులో ఎంసీజీ పిచ్‌పై పచ్చిక చూసి మోసపోవద్దని ఓపికతో ఆడితే పరుగుల వరద పారించొచ్చని ఆసీస్‌ యువ ఓపెనర్‌ మార్కస్‌ హ్యారిస్‌ చెప్పుకొస్తున్నాడు.

 పచ్చికను చూసి భయపడ్డా

పచ్చికను చూసి భయపడ్డా

ఈ నేపథ్యంలో షెఫీల్డ్‌ షీల్డ్‌లో విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చూపిస్తూ బ్యాట్స్‌మెన్ రాణించగలరంటూ అభిప్రాయపడ్డాడు. అప్పుడు పచ్చికను చూసి తాను మ్యాచ్‌ రెండు రోజుల్లోపే ముగుస్తుందని భావించానన్నాడు. కాగా 250 పరుగులతో అజేయంగా నిలిచానని వెల్లడించాడు.

సహనంతో నిలిస్తే ఎక్కువ పరుగులు

సహనంతో నిలిస్తే ఎక్కువ పరుగులు

‘లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూసి భయపడ్డాను. రెండు రోజుల్లోపే ఆట ముగిసిపోతుందేమోనని భావించా. ఎటువంటి ఆశలు లేకుండానే బరిలోకి దిగాను. తర్వాత మెల్‌బోర్న్‌ పిచ్‌ బాగుంటుందని తెలిసింది. కాస్త మందకొడిగా అనిపించింది. ఆదివారం పిచ్‌ను చూడగానే దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఉన్నట్టే ఎక్కువ పచ్చికతో కనిపించింది. అయితే సహనంతో నిలిస్తే ఎక్కువ పరుగులు చేయొచ్చు. అలాగే చక్కగా బౌలింగ్‌ చేస్తే వికెట్లు తీయొచ్చు.

 క్యూరేటర్‌ మ్యాట్‌ పేజ్‌ ఇదే అభిప్రాయం

క్యూరేటర్‌ మ్యాట్‌ పేజ్‌ ఇదే అభిప్రాయం

కానీ, మెల్‌బోర్న్‌లో వెంటనే పరుగులు రావు. సహనంతో ఆడాల్సి ఉంటుంది. పిచ్‌పై పగుళ్లు ఎక్కువగా వస్తాయని అనుకోవడం లేదు' అని హ్యారిస్‌ అన్నాడు. ఎంసీజీ క్యూరేటర్‌ మ్యాట్‌ పేజ్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మన్‌తో పాటు బౌలర్లకు ప్రతి ఒక్కరికీ పిచ్‌ ఎంతో కొంత అనుకూలిస్తుందంటూ పేర్కొన్నాడు.

Story first published: Monday, December 24, 2018, 11:29 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X