న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో ఎలా ఆడాలో కోహ్లీని చూసి నేర్చుకోండి: ఆసీస్ ఆటగాళ్లకు కోచ్

India vs Australia: Australian Batsmen Should Learn From Virat Kohli, Urges Graeme Hick

హైదరాబాద్: టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఆసీస్ క్రికెటర్లకు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ సూచించాడు. మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా 151 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

ప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం: శ్రీనిపై ధోనిప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం: శ్రీనిపై ధోని

ఈ నేపథ్యంలో గ్రేమ్ హిక్ మీడియాతో మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో? చూసి నేర్చుకోవాలని ఇప్పటికే మా ఆటగాళ్లకి చెప్పా. కోహ్లీ, పుజారా.. చాలా ప్రమాదకరమైన ఆటగాళ్లు. తొలుత 20 నుంచి 25 బంతుల వరకూ ఎలాంటి సాహసాలకి వెళ్లకుండా.. పిచ్‌ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ని నిర్మించడం మొదలెడతారు" అని అన్నాడు.

1
43625
అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అలానే

అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అలానే

"వాస్తవానికి ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అలానే బ్యాటింగ్ చేస్తారు. ఎవరైనా, వారిలా ఆడాలనుకుంటే తొలుత మైదానంలో వారి ఆటతీరుని పరిశీలించాలి. ఆ సమయంలో తమ తప్పిదాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవాలి. ఇంకా చెప్పాలంటే.. అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాలంటే మైదానంలో క్రమశిక్షణతో పాటు సహనంతోనూ మెలగాలి" అని గ్రేమ్ హిక్ సూచించాడు.

ఆస్ట్రేలియాకు 399 పరుగుల భారీ లక్ష్యం

కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది.

ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. ఈ టెస్టు సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్ ఆరోన్ ఫించ్(3) మరోసారి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ హారిస్ (13) స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి ఆసీస్

33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి ఆసీస్

దీంతో జట్టు స్కోరు 33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్(44), ట్రావిస్ హెడ్(34), మిచెల్ మార్ష్(10), టిమ్ పైనీ(26), మిచెల్ స్టార్క్(18) పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

నాలుగో రోజు ముగిసిన ఆట: ఆసీస్ 258/8

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 85 ఓవర్లకు గాను 8వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఇంకా 141 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో పాట్ కుమ్మిన్స్ (61), నాథన్ లియోన్(6) పరుగులతో ఉన్నారు.

Story first published: Saturday, December 29, 2018, 13:13 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X