న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: ఫించ్ సెంచ‌రీ.. స్మిత్ హాఫ్ సెంచ‌రీ.. ఆస్ట్రేలియా 317/3!!

India vs Australia: Aaron Finch hits Half Century

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌లు పరుగుల వరద పారిస్తున్నారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ కావ‌డం విశేషం. 117 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో ఫించ్ సెంచరీ పూర్తి చేశాడు. మ‌రోవైపు స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్ చెల‌రేగి ఆడుతున్నాడు. కేవ‌లం 38 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. అంతకుముందు మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అర్ధ శతకం బాదాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఇన్నింగ్స్ ఆదిలో వార్నర్, ఫించ్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ఇద్దరూ బ్యాట్ జులిపించారు. 38 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని ఫించ్ తప్పించుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విసిరిన వైడ్ డెలివరీని వెంటాడిన ఫించ్.. బంతిని గాల్లోకి లేపాడు. శిఖర్ ధావన్ క్యాచ్ అందుకునేందుకు ముందుకు దూకినప్పటికీ.. బంతి అతడికి అందలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫించ్.. కాసేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోకొద్దిసేపటికి వార్నర్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నాడు.

అయితే మొహమ్మద్ షమీ 28వ ఓవర్లో వార్నర్‌ను ఔట్ చేసి టీంఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనింగ్ జోడి తొలి వికెట్‌కు 156 ప‌రుగులు జోడించారు. అయితే వికెట్ తీసిన ఆనందం మాత్రం భారత శిబిరంలో ఎంతోసేపు లేదు. ఒకవైపు ఫించ్.. మరోవైపు స్మిత్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా స్మిత్ వేగంగా ఆడాడు. ఇక 117 బంతుల్లో ఫించ్ సెంచరీ చేయగా.. ఫించ్ 38 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

సెంచ‌రీ చేసిన వెంట‌నే 114 ప‌రుగులు చేసి ఫించ్ ఔట‌‌య్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ త‌ర్వాత వ‌చ్చిన మార్కస్ స్టోయినిస్.. యుజ్వేంద్ర చహ‌ల్ బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే ఔట‌య్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ‌మాక్స్‌వెల్‌ వీరవిహారం చేస్తున్నాడు. 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. దీంతో ఆసీస్ 43వ ఓవర్లోనే 300 రన్స్ మార్క్ దాటింది. 44 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 317 రన్స్ చేసింది. క్రీజులో స్మిత్ (74), మాక్స్‌వెల్‌ (41) ఉన్నారు.

వైరల్ ఫొటోస్.. వివాహబంధంతో ఒక్కటైన స్టార్ రెజర్లు!!వైరల్ ఫొటోస్.. వివాహబంధంతో ఒక్కటైన స్టార్ రెజర్లు!!

Story first published: Friday, November 27, 2020, 12:59 [IST]
Other articles published on Nov 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X