న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీలో 5th ODI: టీమిండియా విజయ లక్ష్యం 273

India vs Australia 5th ODI Live Cricket Score: Usman Khawaja, Peter Handscomb Take Australia To 272/9

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100: 106 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సులు) సెంచరీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (52: 60 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, షమీ, జడేజా తలో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 76 పరుగులు జోడించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించిన తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ మూడో బంతికి ఫించ్(27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ సిరిస్‌లో రెండో సెంచరీ చేసిన ఖావాజా

ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన హాండ్స్‌కోంబ్‌తో కలిసి ఖవాజా నిలకడగా ఆడుతూ వన్డేల్లో 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రెండో సెంచరీని నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో ఖవాజాకు ఇది రెండో సెంచరీ కాగా, వన్డేల్లో కూడా రెండోది కావడం విశేషం. కెరీర్‌లో చేసిన ఈ రెండు శతకాలు భారత్‌పైనే సాధించడం గమనార్హం.

ఇప్పటివరకు 383 పరుగులు చేసిన ఖవాజా

కుల్దీప్‌ వేసిన 31.5వ బంతికి సింగిల్‌ తీసి ఈ ఘనత అందుకున్నాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 383 పరుగులు చేశాడు. దీంతో భారత్‌పై భారత్‌లో ఐదు వన్డేల సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాప్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(358) పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు.

మాక్స్‌వెల్‌ని బోల్తా కొట్టించిన జడేజా

సెంచరీ అనంతరం భువనేశ్వర్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆసీస్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (1) కూడా కోహ్లీకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌లో ఖవాజాని భువనేశ్వర్ ఔట్ చేయగా.. తర్వాత ఓవర్‌లో మాక్స్‌వెల్‌ని జడేజా బోల్తా కొట్టించాడు.

భారత్ విజయ లక్ష్యం 273

భారత్ విజయ లక్ష్యం 273

షమీ బౌలింగ్‌లో హ్యాండ్స్ కోంబ్(52; 60 బంతుల్లో 4 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో రిచర్డ్‌సన్(29), కమ్మిన్స్(15) మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

మూడు వికెట్లు తీసిన భువీ

మూడు వికెట్లు తీసిన భువీ

ఈ మ్యాచ్‌లో బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. గత ఆదివారం మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక భారత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, షమీ, జడేజా తలో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.

1
45589
Story first published: Wednesday, March 13, 2019, 17:39 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X