న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీలో మూడో వన్డే ప్రివ్యూ: సిరిస్ విజయంపై కన్నేసిన కోహ్లీసేన!

India vs Australia 2019, 3rd ODI : Match Preview | Oneindia Telugu
 India vs Australia, 3rd ODI, Preview: Where to watch, timing, probable XI and more

హైదరాబాద్: సొంతగడ్డపై టీమిండియా మరో వన్డే సిరిస్‌పై కన్నేసింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో సైతం విజయం సాధించిన సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.

<strong>ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్</strong>ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్

హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ధోని హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శుక్రవారం రాంచీ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

చివరి వన్డే సిరిస్

చివరి వన్డే సిరిస్

వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడే చివరి వన్డే సిరిస్ కావడంతో ఈ సిరిస్‌ను విజయంతో ముగించాలనే లక్ష్యంతో కోహ్లీసేన ఉంది. ఈ సిరిస్ తాలుకా విజయం వరల్డ్ కప్‌లో టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది. దీంతో మూడో వన్డేలో సైతం గత జట్టునే జట్టు మేనేజ్‌మెంట్ కొనసాగించనుంది. మొదటి రెండు వన్డేల్లో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఆశించిన స్థాయిలో రాణించినప్పటికీ అతన్ని తొలగించే సాహసం జట్టు మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు.

3-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవాలని

3-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవాలని

ఎందుకంటే వరల్డ్ కప్ జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ ఓపెనర్ కావడమే. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌ ఆడుతున్న కీలక సిరీస్‌ కావడంతో మూడో వన్డేలో ధావన్‌నే కొనసాగించనుంది. ఇక, బ్యాకప్ ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఉన్నప్పటికీ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ అనుకుంటే మాత్రం అంబటి రాయుడుకి ఉద్వాసన తప్పదు. ఆసీస్‌త్ రెండు వన్డేల్లోనూ రాయుడు నిరాశపరచడంతో ఆ స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేయవచ్చు.

సిరిస్‌ను నిలబెట్టుకోవాలంటే కంగారులు గెలవాల్సిందే

సిరిస్‌ను నిలబెట్టుకోవాలంటే కంగారులు గెలవాల్సిందే

మరోవైపు భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగే మూడో వన్డే ధోనికి తన సొంతగడ్డపై ఇదే చివరి మ్యాచ్‌ కావచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రెండు వన్డేల్లో కూడా విజయానికి దగ్గరగా వచ్చి ఆస్ట్రేలియా ఓడిపోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. సిరిస్‌ను నిలబెట్టుకోవాలంటే తప్పగ గెలవాల్సిన మ్యాచ్‌లో కంగారులు ఏం చేస్తారో చూడాలి మరి.

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

రాంచీ స్టేడియం గతంలో అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికైంది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఇక, భారత్‌ నాలుగు వన్డేలు ఆడగా రెండింట విజయం సాధించింది. 2013లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, 2016లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడిన వన్డేల్లో ఓటమి పాలైంది.

జట్ల వివరాలు (అంచనా):

జట్ల వివరాలు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, జడేజా, షమి, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా.

ఆసీస్‌: ఉస్మాన్‌ ఖవాజా, ఫించ్‌, షాన్‌ మార్ష్‌, స్టొయినిస్‌, హ్యాండ్స్‌కోంబ్‌, మ్యాక్స్‌వెల్‌, క్యారీ, కల్టర్‌ నైల్‌, కమిన్స్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, ఆడమ్ జంపా.

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

Story first published: Thursday, March 7, 2019, 15:50 [IST]
Other articles published on Mar 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X