న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు భారత్‌-ఆసీస్ మూడో వన్డే.. సిరీస్‌పై ఇరు జట్ల కన్ను.. రోహిత్‌, ధావన్ ఫిట్టేనా

India vs Australia 3rd ODI Preview: probable XI, match prediction, live streaming, weather forecast, and pitch report

బెంగళూరు: వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్‌ విజేత ఎవరో ఆఖరి మ్యాచ్‌తోనే తేలబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో ఫించ్ సేనతో కోహ్లీసేన తలపడనుంది. సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. వన్డే క్రికెట్‌లో అత్యంత పటిష్ఠమైన జట్ల మధ్యమ్యాచ్ కాబట్టి హోరాహోరీ పోరును ఆశించవచ్చు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భళా అనిపించి సిరీస్‌ చేజిక్కించుకునేది ఎవరో చూడాలి. ఈరోజు మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

'ఇంతటి పునరాగమనాన్ని ఆశించలేదు.. అద్భుతంగా ఆడతానని ఊహించలేదు'

రోహిత్‌, ధావన్ ఫిట్టేనా:

రోహిత్‌, ధావన్ ఫిట్టేనా:

బెంగళూరులో ఆడిన మూడు వన్డేల్లో కలిపి డబుల్‌ సెంచరీ సహా 318 పరుగులు చేసిన రికార్డు ఓపెనర్ రోహిత్‌ శర్మ సొంతం. రెండో వన్డేలో రోహిత్‌కు తగిలిన గాయం పెద్దదిగా కనిపించకపోయినా.. బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ గాయం గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే రోహిత్-ధావన్ బరిలోకి దిగవచ్చని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకంగా ఉంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించేందుకు సిద్ధంగా ఉంటాడు.

అయ్యర్‌ ఆడాలి:

అయ్యర్‌ ఆడాలి:

పరిమిత ఓవర్ల జట్టులో స్థిరపడే ప్రయత్నంలో ఉన్న యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ గత రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చినా.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇప్పుడైనా అయ్యర్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ మరోసారి మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. రాహుల్ అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. వికెట్ల వెనుక కూడా తనదైన మార్క్‌ చూపెడుతున్న విషయం తెలిసిందే. మనీశ్‌ పాండేకు కూడా మరో అవకాశం దక్కవచ్చు.

కుల్దీప్‌కే అవకాశం:

కుల్దీప్‌కే అవకాశం:

ముంబై పిచ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు రెండో వన్డేలో మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తొలి స్పెల్‌ చూస్తే అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. మరో పేసర్‌ మొహమ్మద్ షమీ వికెట్లు పడగొడుతున్నా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. నవదీప్ సైనీ కొనసాగనున్నాడు. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్‌కే అవకాశం ఖాయం. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉంటాడు.

హాజల్‌వుడ్‌కు చోటు:

హాజల్‌వుడ్‌కు చోటు:

రెండో వన్డే పరాజయంతో కసిమీదున్న కంగారూలు చెలరేగేందుకు సిద్ధమవుతున్నారు. వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ జోరుమీదుంన్నారు. గత పర్యటనలో హీరోగా నిలిచిన టర్నర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా స్టార్క్‌ ఆసీస్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతనికి తోడుగా పాట్ కమిన్స్‌ చెలరేగుతున్నాడు. కీలక మ్యాచ్‌ కాబట్టి రిచర్డ్సన్‌ స్థానంలో హాజల్‌వుడ్‌కు అవకాశం దక్కవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో జంపా ఇరగదీస్తున్నాడు.

పిచ్‌, వాతావరణం:

పిచ్‌, వాతావరణం:

చిన్నస్వామి పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. చిన్న బౌండరీ కావడంతో పరుగుల వరద ఖాయమే. మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. 2013లో ఇదే పిచ్‌పై ఆసీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్‌ శర్మ (209) డబుల్‌ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం (2017, సెప్టెంబర్‌) చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పాండే, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, బుమ్రా.

ఆ్రస్టేలియా: ఫించ్‌ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, టర్నర్, క్యారీ, అగర్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, జంపా.

Story first published: Sunday, January 19, 2020, 9:14 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X