న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఇంతటి పునరాగమనాన్ని ఆశించలేదు.. అద్భుతంగా ఆడతానని ఊహించలేదు'

Sania Mirza says I was not as rusty as I had thought

హోబర్ట్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పునరాగమనంలో అదరగొట్టింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం రెండేళ్లకు పైగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా.. పునరాగమనంలో బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే టైటిల్‌ పట్టేసి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించింది. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 27 ఏళ్ల నదియా కిచెనోక్‌తో జత కట్టిన 33 ఏళ్ల సానియా డబుల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సానియా-కచనోవ్‌ జోడీ 6-4, 6-4తో రెండోసీడ్‌ చైనా ద్వయం షుయ్‌ పెంగ్‌-షుయ్‌ జాంగ్‌ జంటను చిత్తుచేసింది.

పాక్ పర్యటనకు ముందు బంగ్లాకు దెబ్బ: మొన్న ముష్ఫికర్.. నేడు కోచింగ్ సిబ్బంది!పాక్ పర్యటనకు ముందు బంగ్లాకు దెబ్బ: మొన్న ముష్ఫికర్.. నేడు కోచింగ్ సిబ్బంది!

అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సానియా జోడీ గంటా 21 నిమిషాలలో వరుస సెట్లలో తుది పోరును ముగించింది. ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియాకు ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్‌ కావడం విశేషం. 2017లో బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ ట్రోఫీ తర్వాత సానియా అందుకున్న మొదటి టైటిల్‌ ఇది. ఈ విజయంతో సానియా జోడీకి 13,580 డాలర్లు (రూ.9.65లక్షలు)తో పాటు ఒక్కొక్కరికి 280 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.

సానియా మాట్లాడుతూ... 'ఇంతటి మంచి పునరాగమనాన్ని ఆశించలేదు. నేను టైటిల్‌ గెలిచిన సమయంలో నా పిల్లాడు, తల్లిదండ్రులు నాతోనే ఉండడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. అత్యున్నతస్థాయిలో మళ్లీ అద్భుతంగా ఆడతానని అస్సలు ఊహించలేదు. టైటిల్‌ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. విజయం సాధించాలంటే ఆటను ఆస్వాదిస్తూ ఆడాలి. నేను అదే చేశా. కొత్త భాగస్వామితో, కొత్త ఏడాదిలో ఆడుతున్నాను కాబట్టి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు' అని తెలిపింది.

'దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగడంతో ఈ టోర్నీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఎలా ఆడతానో అని కాస్త కంగారు పడ్డాను. కానీ టైటిల్ గెలిచా. నెల రోజులుగా కాలి పిక్కలో నొప్పిగా ఉంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో ఆరు నెలల సమయం ఉన్న టోక్యో ఒలింపిక్స్‌ గురించి ఇప్పుడే ఆలోచించడంలేదు. టోక్యో కంటే ముందు మరో 15 టోర్నమెంట్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉంది' అని సానియా పేర్కొంది.

2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌ ఆడిన సానియా ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచ్చింది. ఇక 2018 అక్టోబర్‌లో మగబిడ్డ ఇజాన్‌కు జన్మనిచ్చిన సానియా 2019 మొత్తం ఆటకు దూరంగా ఉంది. హోబర్ట్‌ ఓపెన్‌ టైటిల్‌తో సీజన్‌ను ఆరంభించిన సానియా.. సోమవారం మొదలయ్యే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నదియాతోనే కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగనుంది.

Story first published: Sunday, January 19, 2020, 8:32 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X