న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్ట్‌లో విజయం: పంత్ రికార్డుని మరచిన బీసీసీఐ

 India vs Australia: 35 out of 40 caught: World record created in Adelaide Test

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అడిలైడ్ టెస్టులో అరుదైన ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంత్ ఏకంగా 11 క్యాచ్‌లు పట్టి ధోని రికార్డుని సైతం అధిగమించాడు. పంత్ సృష్టించిన వరల్డ్ రికార్డుపై క్రికెట్ ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపిస్తుంటే బీసీసీఐ మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.

<strong>రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్‌పై ఆసీస్ కోచ్ ఇలా!</strong>రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్‌పై ఆసీస్ కోచ్ ఇలా!

భారత ఆటగాళ్లు సాధించిన రికార్డులను అందరి కంటే ముందుగా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసే బీసీసీఐ పంత్ రికార్డుపై ఎటువంటి పోస్ట్ చేయలేదు. చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేసిన బీసీసీఐ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుని గమనించలేదు. అయితే పంత్ రికార్డుని ఐసీసీ ట్వీట్ చేసింది.

ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన ఘనత సాధించిన రిషబ్ పంత్‌ని ఐసీసీ ఆకాశానికెత్తేసింది. మరోవైపు బీసీసీఐ మ్యాచ్ నెగ్గిన తర్వాతి రోజు స్పందించడం విశేషం. బీసీసీఐ తన ట్విట్టర్‌లో "రిషబ్ పంత్ క్రియేట్ చేసిన రికార్డ్‌ను అస్సలు పట్టించుకోలేకపోయామని, ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు" అని పోస్ట్ చేసింది.

తొలి టెస్టులో రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు

తొలి టెస్టులో రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు

అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు పట్టి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. దీంతో ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు భారత వికెట్ కీపర్‌గా రిషబ్ చరిత్ర సృష్టించాడు.

తొలి టెస్టులో 11 క్యాచ్‌లు పట్టిన పంత్

తొలి టెస్టులో 11 క్యాచ్‌లు పట్టిన పంత్

ఈ మ్యాచ్‌లో మొత్తం 11 క్యాచ్‌లు పట్టిన రిషబ్ పంత్‌.. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాక్‌ రసెల్‌ (ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాపై, 1995లో), ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై, 2013లో) ప్రపంచ రికార్డును సమం చేశాడు. అడిలైడ్ టెస్టులో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కూంబ్, ట్రావిస్ హెడ్, టిమ్ పెయిన్, మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఇచ్చిన క్యాచ్‌లు అందుకున్నాడు.

రిషబ్ పంత్‌కు ఇది ఆరో టెస్టు మాత్రమే

రిషబ్ పంత్‌కు ఇది ఆరో టెస్టు మాత్రమే

రెండో ఇన్నింగ్స్‌లో ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, టిమ్ పెయిన్, మిషెల్ స్టార్క్‌ ఇచ్చిన క్యాచ్‌లు పట్టి వరల్డ్ రికార్డ్ సమం చేశాడు. భారత్‌ తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వృద్ధిమాన్‌ సాహా (10) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వృద్ధిమాన్ సాహా గాయపడడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్‌కు ఇది ఆరో టెస్టు మాత్రం కావడం విశేషం.

ఓ టెస్ట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లు:

* 11 - దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ జాక్ రస్సెల్ - జోహన్నెస్బర్గ్, 1995

* 11 - పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్ - జోహన్స్బర్గ్, 2013

* 11 - ఆస్ట్రేలియాపై భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ - అడిలైడ్, 2018

అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్లు

అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్లు

ఇక, భారత విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ధోని, వృద్ధిమాన్ సాహా మాత్రమే ఓ టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టారు. ధోని 9 క్యాచ్‌లు పట్టగా, సాహా 10 క్యాచ్‌లు అందుకున్నారు.

ఓ టెస్ట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్లు:

* 11 - ఆస్ట్రేలియాపై రిషబ్ పంత్ , అడిలైడ్, 2018

* 10 - సౌతాఫ్రికాపై వృద్ధిమాన్ సాహా , కేప్ టౌన్, 2018

* 9 - ఆస్ట్రేలియాపై ధోనీ ,మెల్‌బోర్న్, 2014

Story first published: Tuesday, December 11, 2018, 21:29 [IST]
Other articles published on Dec 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X