న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసీస్: రెండో టెస్టు ప్రివ్యూ: ఎక్కడ చూడాలి, టైమింగ్, జట్ల వివరాలు

India vs Australia 2nd Test Preview : Bounce And Pace Pitch At Perth | Oneindia Telugu
India vs Australia, 2nd Test: Preview, where to watch, timing, squads & more

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టులో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో పెర్త్ పిచ్ పేస్‌తో పాటు బౌన్సింగ్‌కు అనుకూలంగా మారనుంది.

లక్ష్యం అదే: టెస్టు బెర్త్ కోసం ఐపీఎల్‌కు దూరమైన ఆసీస్ హిట్టర్లక్ష్యం అదే: టెస్టు బెర్త్ కోసం ఐపీఎల్‌కు దూరమైన ఆసీస్ హిట్టర్

ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు విజయ ఉత్సహాంతోనే కోహ్లీసేన రెండో రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది.

దీంతో రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరిస్‌లో తమ ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆతిథ్య జట్టు సైతం పెర్త్ టెస్టుని ప్రతిష్టాత్మంకగా తీసుకుంది. ఈ టెస్టులోనైనా విజయం సాధించిన సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా పెర్త్ టెస్టుకు ఫాస్ట్ మరియు బౌన్సింగ్ పిచ్‌ను సిద్ధం చేసినట్లు పిచ్ క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్పి వెల్లడించాడు. ఏది అయితేనేం ఈ సిరిస్‌లో రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ స్టేడియంలో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడంతో ఫలితం ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉంటుందో లేదో చూడాలి.

టీమ్ టాక్ - టీమిండియా

టీమ్ టాక్ - టీమిండియా

పెర్త్ టెస్టుకు టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కారణంలో తొలి టెస్టులో ఆడిన రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ గాయాల బారిన పడటం వల్ల. రెండో టెస్టు కోసం గురువారం ప్రకటించిన 13 మంది సభ్యుల్లో ఈ ఇద్దరూ దూరమయ్యారు. వీరి స్థానంలో హనుమ విహారి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు దక్కింది. దీంతో రెండో టెస్టులో ఓపెనింగ్ కాంబినేషన్ కేఎల్ రాహుల్-మురళీ విజయ్‌గానే ఉండబోతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఏ బౌలింగ్ కాంబినేషన్‌తో వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది మొదట్లో జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లీ ఒక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో నలుగురు పేసర్లతో తుది జట్టుని ఎంచుకున్నాడు. కారణం అది కూడా పచ్చికతో కూడిన పిచ్ కావడమే. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీ నలుగురు పేసర్లతో వెళ్లే అవకాశం ఉంది. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారికి చోటు దక్కే అవకాశం ఉంది. విహారి స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడనే సంగతి తెలిసిందే.

టీమ్ టాక్ - ఆస్ట్రేలియా

టీమ్ టాక్ - ఆస్ట్రేలియా

అడిలైడ్ టెస్టు అనంతరం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ రెండో టెస్టులో ఎటువంటి మార్పులు ఉండబోవని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, పెర్త్ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అడిలైడ్ టెస్టులో ఓపెనర్ ఆరోన్ ఫించ్ నిరాశపరచడంతో అతడిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్ష్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆరోన్ ఫించ్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఇక, బౌలర్ల విషయానికి వస్తే హజెల్ ఉడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్‌లు ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.

పెర్త్ టెస్టులో స్పిన్ పాత్ర ఎంతమేరకు?

పెర్త్ టెస్టులో స్పిన్ పాత్ర ఎంతమేరకు?

రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్‌లో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్ జరగలేదు. ఈ ఏడాది నవంబర్‌లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా-న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ జరిగింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో బౌలర్లు మొత్తం 40 వికెట్లు తీశారు. ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో ఉన్న స్పిన్నర్ నాథన్ లయాన్ 7 వికెట్లు తీసి 120 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిని బట్టి చూస్తే రెండో టెస్టులో అశ్విన్ స్థానాన్ని రవీంద్ర జడేజా భర్తీ చేసేలా కనిపిస్తోంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌

ఆస్ట్రేలియా: టిమ్ పైన్(కెప్టెన్), మార్కస్ హారిస్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, నాథన్ లయాన్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్ ఉడ్

మ్యాచ్ ప్రసారం

మ్యాచ్ ప్రసారం

మ్యాచ్ ప్రారంభం: శుక్రవారం ఉదయం 7.50 గంటలకు

ప్రత్యక్ష ప్రసారం: సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్

లైవ్ స్ట్రీమింగ్: సోనీ లైవ్

Story first published: Thursday, December 13, 2018, 15:14 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X