న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంచ్ విరామానికి 252/7తో భారత్, తప్పుడు నిర్ణయంతో కోహ్లీ అవుట్(వీడియో)

India vs Australia, 2nd Test Day 3 in Perth: India 252/7 at Lunch,

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ నిలబడిదంి. ఓవర్ నైట్ స్కోరు 172/3తో ఇన్నింగ్స్ ఆరంభించి తొలి ఓవర్లోనే అజింక్య రహానె (51: 105 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సు) వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానె ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. జట్టు స్కోరు 173 వద్దే భారత్ 4వ వికెట్ చేజార్చుకుంది.

లయన్.. బౌలింగ్‌లోనే రహానె

శనివారం ఆఖరి సెషన్‌లో ఆస్ట్రేలియా బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న రహానె- కోహ్లీ జోడి.. నాలుగో వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శనివారం ఈజోడీని విడదీయలేక చేతులెత్తేసిన స్పిన్నర్ లయన్.. ఆదివారం తొలి ఓవర్‌లోనే సులువుగా వికెట్ తీయడం విశేషం.

ఔట్‌గా ప్రకటించిన థర్డ్‌ అంపైర్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వివాదాస్పద రీతిలో పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ వేసిన 93వ ఓవర్‌ చివరి బంతి కోహ్లి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని సెకండ్‌ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్‌ చేతిలో పడింది. అయితే బంతి నేలకు తాకినట్లుగా అనిపించడంతో ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరారు. క్లిష్టతరమైన ఈ కాల్‌ను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్‌ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది.

అసహనం వ్యక్తం చేస్తూనే కోహ్లీ

ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అనేది బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా ఇవ్వాల్సి ఉన్నప్పటికి థర్డ్‌ అంపైర్‌ ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై కోహ్లి కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ షమీ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో లంచ్‌ విరామానికి భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఆసీస్‌ కన్నా భారత్‌ 74 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో రిషబ్‌ పంత్‌ (14) ఉన్నాడు.

1
43621
Story first published: Sunday, December 16, 2018, 10:55 [IST]
Other articles published on Dec 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X