న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్‌లో రెండో టీ20: మ్యాక్స్‌వెల్ ఔట్, కష్టాల్లో ఆస్ట్రేలియా (వీడియో)

India vs Australia 2nd T20I Live Score: Glenn Maxwell Departs, Australia Struggle

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా 16 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కౌల్టర్-నైల్(20), బెన్ డార్మెట్ (20) పరుగులతో ఉన్నారు.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా, కుల్దీప్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డకౌట్‌ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ లిన్(13), షార్ట్(14), మ్యాక్స్‌వెల్ (19), స్టోయినిస్(4), కౌల్టర్-నైల్(20) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్ వేస్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య పోటాపోటీగా బంతులు వేస్తున్నారు.

1
43621

పరుగులు తీయకుండా కట్టడి చేస్తున్నారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ చివరి బంతికి మాక్స్‌వెల్‌ (19)ను పాండ్యా, 14వ ఓవర్ తొలి బంతికి అలెక్స్‌ కారె (4)ను కుల్దీప్‌ పెవిలియన్ ‌పంపించారు. బుమ్రా బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్(4) ఇచ్చిన క్యాచ్‌ను దినేశ్ కార్తీక్ అద్భుతంగా అందుకున్నాడు.

మరోవైపు రెండో టీ20 జరుగుతున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం ప్రేక్షుకులతో కిక్కిరిసిపోయింది. ఈ మ్యాచ్‌కి ఇరు జట్లకు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైదానాల్లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి అన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 23, 2018, 14:54 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X