న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia, 2nd T20: జోరు మీద కోహ్లీ సేన.. గాయాలతో ఆస్ట్రేలియా! గెలిచేదెవరో? తుది జట్లు ఇవే!

India vs Australia, 2nd T20 Preview: Virat Kohli and Co Look To Seal Series

సిడ్నీ: చివరి వన్డేతో పాటు తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా కీలకపోరుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ)లో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌ చిత్తుగా ఓడింది. కానీ ఈసారి ఆ ఓటములకు బదులు తీర్చుకుంటూనే సిరీస్‌ కూడా వశం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది.

ఈ ఫార్మాట్‌లో భారత జట్టు 2019, డిసెంబరులో విండీస్‌ చేతిలో చివరిసారిగా పరాజయం చవిచూసింది. ఆ తర్వాత శ్రీలంక, కివీస్‌లపై వరుసగా నెగ్గింది. అటు ఆసీస్‌ మాత్రం పట్టుదలగా ఆడి ప్రత్యర్థికి ఝలక్‌ ఇవ్వాలనుకుంటోంది. అయితే భారత్‌ వరుస విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి.

బ్యాటింగ్‌లో మెరుగవ్వాలి..

బ్యాటింగ్‌లో మెరుగవ్వాలి..

వన్డే సిరీస్‌లో రాణించిన శిఖర్ ధావన్, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో వీళ్లిద్దరు బ్యాట్‌ ఝుళిపిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ ఇద్దరు జతయితే భారత్‌ దర్జాగా ఓ మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ గెలుచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ గతి తప్పింది. దీంతో మార్పు చేయాలనుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కానీ వన్డేల్లో అయ్యర్‌ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా... అతని ఫామ్‌ ఆసీస్‌లో బాగుంది. ఇతను కూడా మెరిపిస్తే భారత్‌ స్కోరును నిలువరించడం ముమ్మాటికి అసాధ్యమే.

జడేజా లోటు..

జడేజా లోటు..

తొలి టి20లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేగవంతమైన ఇన్నింగ్సే భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించడమే కాకుండా బౌలర్లు పోరాడేందుకు అవకాశం కల్పించింది. కానీ గాయంతో అతను మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ముగియగానే పెవిలియన్‌ చేరాడు. ఇప్పుడైతే సిరీస్‌కే దూరమైన పరిస్థితి. బౌలింగ్‌లో అతని లోటును స్పిన్నర్‌ చాహల్‌ భర్తీ చేసి ఉండవచ్చు. కానీ బ్యాటింగ్‌లో ఎవరుంటారనేది ప్రశ్నార్థకం.

చాహల్‌ పూర్తిగా బౌలర్‌. ఇతని కోసం ఓ బ్యాట్స్‌మన్‌ లోటు ఏర్పడుతుంది. దీన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఏలా అధిగమిస్తుందో చూడాలి. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న షమీ స్థానంలో బుమ్రాను తీసుకునే అవకాశాలున్నాయి. వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌తో కట్టడి చేశాడు. వీళ్లిద్దరు సిడ్నీలోనూ అదరగొడితే భారత్‌కు విజయం సులువవుతుంది.

కంగారూ... కంగారూ...

కంగారూ... కంగారూ...

ఆస్ట్రేలియా జట్టును గత ఫలితం, సిరీస్‌ భయమే కాదు... గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో ఈ మ్యాచ్‌ ఆడే అవకాశాల్లేవు. అతను గైర్హాజరైతే తాత్కాలిక సారథ్యాన్ని మాథ్యూ వేడ్‌కు అప్పగించవచ్చు. కానీ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ స్థానాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు.

వన్డేల్లో చెలరేగిన స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను గత మ్యాచ్‌లో భారత బౌలర్లు తెలివిగా ఔట్‌ చేశారు. ఇదే ఆసీస్‌ ఫలితాన్ని మార్చేసింది. 56 పరుగులదాకా అజేయంగా సాగిన ఇన్నింగ్స్‌ తర్వాత చతికిలబడింది. అయితే వేదిక మాత్రం ఆసీస్‌ను ఊరడిస్తుంది. ఇక్కడే జరిగిన తొలి రెండో వన్డేల్లో కంగారూ జట్టు జయభేరి మోగించింది. కాన్‌బెర్రా నిరాశపరిచినా... మళ్లీ సిడ్నీకి రావడంతో తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా జట్టు ఆశిస్తోంది.

Ind vs Aus 2020,1st T20 : 'Concussion Substitute Worked For Us' - Virat Kohli
జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, సామ్సన్, మనీశ్‌ పాండే/అయ్యర్, హార్దిక్‌ పాండ్యా, సుందర్, దీపక్‌ చహర్, నటరాజన్, బుమ్రా/షమీ, చాహల్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌)/డార్సీ షార్ట్, వేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, అబాట్, స్టార్క్, స్వెప్సన్‌/లయన్, జంపా, హజల్‌వుడ్‌.

పిచ్, వాతావరణం

బ్యాటింగ్‌ అనుకూలమైన పిచ్‌. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు సునాయసంగా 300పైచిలుకు పరుగుల్ని చేశాయి. ఇక ధనాధన్‌గా సాగే టీ20 ఫార్మాట్‌లో అంతకుమించే ఉంటుంది. వర్షం భయం లేదు.

Story first published: Sunday, December 6, 2020, 9:44 [IST]
Other articles published on Dec 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X