న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్‌తో ఉన్నా: ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ ఫోటో

India vs Australia 2018 -19: Kohli Next Few Weeks With 'Champion' Rishabh Pant | Oneindia Telugu
India vs Australia 2018: Virat Kohli looking forward to the next few weeks with champion Rishabh Pant

హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన టీమిండియా శనివారం ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 టీ20ల సిరిస్‌ ఆడనుంది. ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను ఓ ఛాంపియన్‌తో కలిసి ఆ దేశంలో ఉన్నానంటూ ట్వీట్‌ చేశాడు.

<strong>ఇండియా Vs ఆస్ట్రేలియా: 'టీ20 వరల్డ్‌కప్ గెలిచి సత్తా భారత్‌కు ఉంది'</strong>ఇండియా Vs ఆస్ట్రేలియా: 'టీ20 వరల్డ్‌కప్ గెలిచి సత్తా భారత్‌కు ఉంది'

విరాట్ కోహ్లీ పక్కనే ఉన్న ఆ టీమిండియా క్రికెటర్ మరెవరో కాదు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. "ఆస్ట్రేలియా చేరుకున్నాం. కొన్ని వారాల పాటు ఇక్కడే, ఛాంపియన్‌ రిషబ్‌ పంత్‌తో" అని కోహ్లీ తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ సెల్ఫీ తీస్తుండగా పంత్‌ విక్టరీ సింబల్‌ను చూపుతూ ఫోజిచ్చాడు.

 ఆస్ట్రేలియా పర్యనటలో భాగంగా

ఆస్ట్రేలియా పర్యనటలో భాగంగా

ఆస్ట్రేలియా పర్యనటలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్‌ ధోనీని పక్కకు పెట్టిన సెలెక్టర్లు టీ20 సిరీస్‌ కోసం రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన రిషబ్ పంత్... ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ధోని

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ధోని

ఇటీవల వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం అద్భుత ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌ నవంబరు 21న ప్రారంభం కానుంది. ఆ దేశ పర్యటన అనంతరం భారత్‌-న్యూజిలాండ్ మధ్య టోర్నీ జరగనుంది.

ఆసీస్ గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను

ఆసీస్ గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను

ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.

ఆసీస్ పర్యటనలో భారత టీ20 జట్టు:

ఆసీస్ పర్యటనలో భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

ఆసీస్ పర్యటనలో భారత టెస్ట్ జట్టు:

ఆసీస్ పర్యటనలో భారత టెస్ట్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Saturday, November 17, 2018, 15:16 [IST]
Other articles published on Nov 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X