న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టు ఎంపికలో పొరబాట్లు: రవిశాస్త్రి వాదనలో నిజముందా..?

India vs Australia 2018: Ravi Shastri adds injury to insult

మెల్‌బోర్న్‌: పెర్త్ టెస్టు ఓటమి అనంతరం జట్టు ఎంపికపై చాలా సందేహాలు తలెత్తాయి. నలుగురు ఫేసర్లతో బరిలోకి దిగడమనేది తప్పుడు చర్యేనని కెప్టెన్ కోహ్లీ సైతం ఒప్పుకున్నాడు. కానీ, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వాదన మాత్రం మరోలా అనిపిస్తోంది. గాయాలపాలై ఇబ్బంది పడుతున్న వారికి విశ్రాంతి ఇవ్వడం వల్లనే అలా చేశామని చెప్పిన శాస్త్రి మాటల్లో నిజం భూతద్దంతో వెతకాల్సిన పరిస్థితి. కొద్ది నెలల కిందట ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డ టీమిండియా.. మూడో టెస్టులో పుంజుకుని అద్భుత విజయం సాధించింది.

తర్వాతి టెస్టులోనూ అదే విజయాన్ని కొనసాగించి సిరీస్‌ సమం చేస్తారని భావిస్తే బెడిసికొట్టింది. ఈ ఓటమికి కారణాలు విశ్లేషిస్తే.. స్పిన్నర్‌ అశ్విన్‌ ఫిట్‌నెస్‌ లేకుండానే మ్యాచ్‌ ఆడాడట. దీంతో అతని పూర్తి స్థాయి ప్రదర్శన చూపించలేక ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. మరి ఆ మ్యాచ్‌కు అశ్వినే గాయాన్ని కప్పి పుచ్చాడో.. లేదా గాయం ఉన్నా పర్వాలేదని జట్టు యాజమాన్యమే అతడిని ఆడించిందో అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది.

1
43625
పిచ్‌ను తప్పుగా అంచనా వేసి.. స్పిన్నర్‌కు

పిచ్‌ను తప్పుగా అంచనా వేసి.. స్పిన్నర్‌కు

తుది జట్టు ఎంపికలో చేసిన పెద్ద పొరబాటు పెర్త్‌ టెస్టులో ఓటమికి దారి తీసింది. పిచ్‌ను తప్పుగా అంచనా వేసి.. స్పెషలిస్టు స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వలేదు. నలుగురూ పేసర్లనే ఎంచుకున్నారు. ఈ తప్పును ఒప్పుకోని రవిశాస్త్రి భారత్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నప్పటి నుంచే సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా భుజం నొప్పితో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఆస్ట్రేలియాకు వచ్చిన 4 రోజుల తర్వాత సూది మందు తీసుకుని ఉపశమనం పొందాడని పేర్కొన్నారు.

కోహ్లీయే భారత జట్టుకు బలం: బ్రాడ్ హగ్

13 మందితో జట్టును ప్రకటించినప్పుడే సమస్య

13 మందితో జట్టును ప్రకటించినప్పుడే సమస్య

సరిగ్గా పెర్త్‌లో రెండో టెస్టుకు 13 మందితో జట్టును ప్రకటించినప్పుడే అతడి సమస్య బయటకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో లేకున్నా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జడ్డూ చాలాసేపు ఫీల్డింగ్‌ చేశాడు. దీంతో ఒకవేళ అంత గాయపడ్డ ఆటగాడికి విశ్రాంతినివ్వకుండా జట్టు మేనేజ్‌మెంట్‌ ఎలా ఆడనిచ్చిందో మరి.

ఆస్ట్రేలియాకు వచ్చిన 4 రోజులకు సూది మందు

ఆస్ట్రేలియాకు వచ్చిన 4 రోజులకు సూది మందు

‘భుజంలో నొప్పి ఉందని ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు జడేజా సూది మందు తీసుకున్నాడు. ఉపశమనం పొందడానికి కాస్త సమయం పడుతుంది. భారత్‌లో రంజీ ఆడుతున్నప్పుడే అతడికి సమస్య ఉంది. ఆసీస్‌కు వచ్చిన తర్వాత అలాగే ఇబ్బంది పడటంతో సూది మందు ఇచ్చారు' అని శాస్త్రి చెప్పారు. అలా అనుకుంటే వందశాతం ఫిట్‌నెస్‌ ఉండాలని లేదంటే విదేశీ పర్యటనలకు అనుమతించరంటూ పెట్టిన నిబంధనలు ఏమైనట్టోనని సందేహాలు తలెత్తాయి.

హార్దిక్‌ పాండ్య ఫిట్‌గా..

హార్దిక్‌ పాండ్య ఫిట్‌గా..

‘పెర్త్‌ మ్యాచ్‌ సమయానికి 70-80 శాతం ఫిట్‌గా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు 80 శాతానికి పైగా ఫిట్‌గా ఉంటేనే మెల్‌బోర్న్‌లో ఆడతాడు. ఫిట్‌నెస్‌ చాలా పెద్ద సమస్య. 48 గంటల తర్వాత అశ్విన్‌ పరిస్థితిని అంచనావేస్తాం. రోహిత్‌ శర్మలో మెరుగుదల కనిపించింది. సోమవారం అతడి సంగతి తెలుస్తుంది. ఇప్పటికైతే హార్దిక్‌ పాండ్య ఫిట్‌గా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. అతడ్ని ఆడించాలా వద్దా అని నిర్ణయించే ముందు ఇంకా ఆలోచించాల్సి ఉంది' అని శాస్త్రి అన్నాడు.

Story first published: Monday, December 24, 2018, 8:33 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X