కోహ్లీయే భారత జట్టుకు బలం: బ్రాడ్ హగ్

మెల్‌బోర్న్: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శలతో దెప్పిపొడుస్తుంటే.. ఆ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ భిన్నంగా స్పందించాడు. భారత క్రికెట్ జట్టు బలం వారి కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని ఆస్ర్టేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో కోహ్లీ దూకుడు ప్రవర్తనపై కొందరు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో హాగ్ వ్యాఖ్యలు భారత కెప్టెన్‌కు ఊరటనిచ్చేవే. కోహ్లీ దూకుడు శైలికి మద్దతుగా నిలుస్తూ అతను భారత జట్టుకు బలమని చెప్పుకొచ్చాడు.

కోహ్లీ నుంచి ప్రేరణ పొందుతోందని హాగ్
భారత జట్టు కోహ్లీ నుంచి ప్రేరణ పొందుతోందని హాగ్ అన్నాడు. పీటీఐతో హగ్ మాట్లాడుతూ టీమిండియాకు కోహ్లీ అద్భుతమైన నాయకుడు. మైదానంలో విరాట్ దూకుడుతనాన్ని ఓసారి చూస్తే తెలుస్తుంది. జట్టుకూడా అతనిలాగా ఉండాలనుకుంటాడు. వారి నుంచి ఎప్పటికీ అదే ఆశిస్తూ సహచరులను ఫాలో కావాలని కోరుతాడు. కేవలం నాయకునిగానే కాదు బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ది అత్యుత్తమ స్థాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడు అతను. అలవోకగా బౌండరీలు సాధిస్తూ..పరుగులు కొల్లగొట్టడంలో ముందుంటాడు.

ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలంటే
మూడో టెస్ట్‌లో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలంటే భారత్ తుదిజట్టు సరిగ్గా ఎంపిక చేసుకోవాలి అని హాగ్ అన్నాడు. ఇప్పటికే కోహ్లీని మద్ధతిస్తూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఇక విమర్శలు చాలించాలని చెప్పుకొచ్చాడు. సాధారణంగానే కోహ్లీని ఇష్టపడే షోయబ్ ఆసీస్ గడ్డపై జరిగిన ఉదంతానికి కోహ్లీ తప్పేమీ లేదంటూ వెనకేసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ తరం క్రికెట్‌లో దిగ్గజం. హోరాహోరీ పోటీవున్న క్రికెట్‌లో దూకుడనేది ఒక భాగం. పరిమితుల్లో ఉన్నంత వరకు ఏం చేసినా ఫర్వాలేదు. దయచేసి కోహ్లీని వదిలేయండి' అని అక్తర్ ట్వీట్ చేశాడు.

ఏ దశలోనూ వెనుకంజ వేయకూడదనే
ఈ క్రమంలోనే కోహ్లీని విలన్‌లా చిత్రీకరించే యత్నం చేస్తున్నారని మండిపడ్డాడు ఆకాశ్ చోప్రా. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు ఆపితే మంచిదంటూ సూచనలిచ్చాడు. ఇంకా ఆసీస్ మాజీ కోచ్ వెనకేసుకొస్తూ..
‘సౌరవ్ గంగూలీ తరహాలో ఏ దశలోనూ వెనుకంజ వేయకూడదనే సంప్రదాయాన్ని విరాట్ కొనసాగిస్తున్నాడు. తన సహచరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. భారత క్రికెట్‌కు అవసరమైన నాయకుడతను. ఆటను ఎలా ఆడాలో సాంకేతికంగానే కాక నాయకుడి కోణం నుంచి అతను చూపిస్తున్నాడు. గంగూలీ ఘన వారసత్వాన్ని అతను కొనసాగిస్తున్నాడు' అని ఆసీస్ మాజీ కోచ్ బుకానన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications