న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసీస్: తొలి టీ20: ఎప్పుడు, మ్యాచ్ ఎక్కడ చూడాలి, గణాంకాలివే

India vs Australia 2018, 1st T20: When and Where to Watch, Preview, Head to Head, Key Stats and More

హైదరాబాద్: బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సుదీర్ఘ పర్యటనకు తెరలేవనుంది.

మూడు టీ20ల సిరిస్ ముగిసిన అనంతరం 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఆసీస్ జట్టులో లేకపోవడంతో ఈ సిరిస్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. దీంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఈసారి టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోంది.

తేదీ: నవంబర్ 21, బుధవారం

తేదీ: నవంబర్ 21, బుధవారం

మ్యాచ్: ఇండియా Vs ఆస్ట్రేలియా, తొలి టీ20

సమయం: మధ్యాహ్నాం 1:20 గంటలకు

వేదిక: గబ్బా స్టేడియం, బ్రిస్బేన్

టీ20ల్లో ఇరు జట్లు ముఖాముఖి:

అంతర్జాతీయ టీ20ల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 15 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 సార్లు విజయం సాధించగా, ఆస్ట్రేలియా 5 సార్లు విజయం సాధించింది.

మొత్తం మ్యాచ్‍లు: 15

మొత్తం మ్యాచ్‍లు: 15

భారత్ విజయం సాధించినవి: 10

ఆసీస్ గెలిచినవి: 5

ఇటీవల ప్రదర్శనలు:

ఇండియా: WLWWL

ఆస్ట్రేలియా: WLLWW

రికార్డులు, మైలురాళ్లు:

రికార్డులు, మైలురాళ్లు:

* అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలవాలంటే మరో 64 పరుగులు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్(2271) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(2207) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

* టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో 4 వికెట్లు తీస్తే టీ20ల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఫలితంగా టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

మూడు టీ20లు:

మూడు టీ20లు:

తొలి టీ20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)

రెండో టీ20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

మూడో టీ20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

టీమిండియా

విరాట్ కోహ్లీ(c), దినేశ్ కార్తీక్(wk), రిషబ్ పంత్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియా

ఆరోన్ ఫించ్(c), ఆండ్రూ టై, బిల్లీ స్టాన్ లేక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, అలెక్స్ క్యారీ(wk), మార్కస్ స్టోయినిస్, డార్సీ షార్ట్, ఆడమ్ జంపా, ఆష్టన్ ఆగర్.

ఛానల్: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్

ఛానల్: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్: Hotstar.com

టికెట్ డిటేల్స్:

భారత్ vs ఆస్ట్రేలియా తొలి టీ20 టికెట్లను ఆన్‌లైన్‌లో https://www.viagogo.com/ ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.

Story first published: Tuesday, November 20, 2018, 13:27 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X