న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీలో తొలి వన్డే..: ఆసీస్ జట్టిదే, టీమిండియా తుది జట్టుపై డైలమా!

India vs Australia : Ist ODI Preview, Timing, Possible XI Sauad | Oneindia Telugu
India vs Australia 1st ODI: Hosts announce playing XI for 1st ODI, Peter Siddle returns to ODIs after 8 years

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసింది. శనివారం నుంచి ఆసీస్ గడ్డపై మూడు వన్డేల సిరిస్‌కు టీమిండియా సిద్దమైంది. సిడ్నీ వేదికగా శనివారం ఉదయం 7.50 నుంచి తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డే కోసం ఆతిథ్య జట్టు తుది జట్టుని శుక్రవారం ప్రకటించింది.

<strong>మహిళలపై పాండ్యా, రాహుల్ అనుచిత వ్యాఖ్యలు: కోహ్లీ ఏమన్నాడంటే!</strong>మహిళలపై పాండ్యా, రాహుల్ అనుచిత వ్యాఖ్యలు: కోహ్లీ ఏమన్నాడంటే!

దీంతో 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ సిడ్డిల్ వన్డే ఆడబోతున్నాడు. ఆరోన్ ఫించ్‌తో కలిసి అలెక్స్ క్యారీ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు రానున్నాడు. తుది జట్టుకు ఎంపికైన పీటర్ సిడ్డిల్ అరుదైన ఘనత సాధించాడు. ఎక్కువ గ్యాప్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడుతోన్న క్రికెటర్‌గా నిలిచాడు.

పీటర్ సిడ్డిల్ చివరగా ఆస్ట్రేలియా తరుపున వన్డే మ్యాచ్ నవంబర్ 9, 2010లో ఆడాడు. పీటర్ సిడ్డిల్ తన చివరి వన్డేని ఏ మైదానంలో అయితే ఆడాడో అదే మైదానంలో తిరిగి బరిలోకి దిగుతుండటం విశేషం. అంతకముందు ఈ రికార్డు టిమ్ జోహ్రెర్ పేరిట ఉంది.

పీటర్ సిడ్డిల్ అరుదైన ఘనత

పీటర్ సిడ్డిల్ అరుదైన ఘనత

1986 ఆసీస్ తరుపున వన్డే ఆడిన టిమ్ ఆ తర్వాత మళ్లీ 1994లో తుది జట్టుకు ఎంపికయ్యాడు. అంటే ఆరు సంవత్సరాల 282 రోజుల తర్వాత మళ్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే పీటర్ సిడ్డిల్ విషయానికి వస్తే ఎనిమిదేళ్లు గ్యాప్ ఉండటం విశేషం.

తొలి వన్డేకు ఆసీస్ జట్టు:

తొలి వన్డేకు ఆసీస్ జట్టు:

అలెక్స్ క్యారీ, ఆరోన్ పింఛ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జాసన్ బెహ్రాన్‌డార్ప్, పీటర్ సిడ్డిల్, నాథన్ లియాన్, రిచర్డ్‌సన్

డైలమాలో టీమిండియా:

డైలమాలో టీమిండియా:

సిడ్నీ వన్డేకి భారత్‌ తుది జట్టుపై డైలమా ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించనున్నారంటూ వార్తల వస్తున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై టీమిండియాకి స్పష్టత రావడం లేదు.

దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌కి మార్గం సుగమం

దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌కి మార్గం సుగమం

ఒకవేళ ఆ ఇద్దరినీ తప్పించాల్సి వస్తే? దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌కి మార్గం సుగమం కానుంది. ఆ ఇద్దరి నిషేధంపై బీసీసీఐ నిర్ణయం కోసం జట్టు మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తున్నట్లు కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఇటీవల నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

భారత్ వన్డే జట్టు:

భారత్ వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Story first published: Friday, January 11, 2019, 12:25 [IST]
Other articles published on Jan 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X