న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫించ్, వార్నర్‌లు సెంచరీలు: వికెట్ కోల్పోకుండా టీమిండియాపై ఆసీస్ ఘన విజయం

 India vs Australia, 1st ODI: Australia complete 10-wicket win after Warner, Finch hundreds

హైదరాబాద్: చాలా రోజుల తర్వాత టీమిండియా ఓ చెత్త ఓటమిని నమోదు చేసింది. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల విజయ లక్ష్యాన్ని 37.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్(110 బంతుల్లో 114, 13 ఫోర్లు, 2 సిక్సులు), డేవిడ్‌ వార్నర్‌(112 బంతుల్లో 128, 17 ఫోర్లు, 3 సిక్సులు)లు సెంచరీలు సాధించి ఆసీస్‌కు ఘన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో మూడు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 256
అంతకముందు టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 256 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా... ప్యాట్ కమిన్స్‌, కేన్ రిచర్డ్‌సన్‌లు చెరో రెండు వికెట్లు.. ఆడమ్ జంపా, ఆష్టన్ ఆగర్‌లు తలో వికెట్ తీసుకున్నారు.

అచ్చిరాని నాలుగు.. క్రీజు వీడిన కోహ్లీ!!అచ్చిరాని నాలుగు.. క్రీజు వీడిన కోహ్లీ!!



ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను శిఖర్ ధావన్ తన భుజాలకెత్తుకున్నాడు.

కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ... శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 28వ హాఫ్ సెంచరీ.

వీరిద్దరి జోడీ 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్‌ ఔటయ్యాడు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(91 బంతుల్లో 74, 9 ఫోర్లు, సిక్స్) సైతం ఔటయ్యాడు. దీంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్‌ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్‌ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్‌ డ్రైవ్‌ కొట్టబోయి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్‌ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్‌ చేద్దామనుకునే వికెట్‌ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్‌ 156 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌(4) సైతం నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్‌ బౌలిం‌గ్‌లో వికెట్ కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ కేరీ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. అయ్యర్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.



రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, రిచర్డ్‌సన్ వేసిన 43వ ఓవర్ తొలి బంతికి రవీంద్ర జడేజా(25) ఆష్టన్ టర్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 229 పరుగుల వద్ద ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(28) కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్(10 బంతుల్లో 13, 2 ఫోర్లు) కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ.... మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన బంతికి అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్(17), మహ్మద్ షమీ(10) స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. కానీ, ఆసీస్ బౌలర్లు రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది.
Story first published: Tuesday, January 14, 2020, 20:48 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X