న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvAFG, డే1: ఓపెనర్లు సెంచరీలు చేసినా.. టీమిండియా 347/6

Dhawan

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆప్ఘనిస్థాన్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సయమానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా (10), అశ్విన్ (7) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు ఇద్దరూ శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్ (105) సెంచరీలతో చెలరేగగా... కేఎల్ రాహుల్ (54) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 107 పరుగులు చేసిన ధావన్ అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

India vs afghanistan Match : India Won Toss 7 Opted For Batting

ఆనంతరం మురళీ విజయ్ దూకుడుగా ఆడి 153 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 105 పరుగులు చేశాడు. ఈ సమయంలో వఫాదార్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 280 పరుగుల వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. ఆ వెంటనే లోకేశ్ రాహుల్(54) అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

1
43367

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా(35), కెప్టెన్ అజింక్యా రహానే(10), దినేశ్ కార్తీక్(4) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. అఫ్ఘానిస్థాన్ బౌలింగ్‌లో అహ్మద్‌జాయ్ 2, వఫాదార్, రషీద్, ముజీబ్ తలో వికెట్ తీశారు.


మూడు బంతులకు రెండు వికెట్లు అవుట్:

అఫ్ఘన్ బౌలర్లకు వర్షం బాగా కలిసొచ్చినట్లైంది. వర్షం కారణంగా రిఫ్రెష్ అయిన బౌలర్లు కేవలం మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీయగలిగారు. మురళీ విజయ్ (51.5 ఓవర్) వఫాదర్ బౌలింగ్‌లో 153 బంతులు ఆడి 105 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఆడుతున్న రాహుల్ కేవలం ఒక్క బంతి వ్యవధిలోనే (52.1) బంతికి యామిన్ అహ్మద్‌జై చేతికి చిక్కాడు. దీంతో మూడు బంతుల్లో రెండు వికెట్లు తీయగలిగింది అఫ్ఘనిస్థాన్. 55 ఓవర్లు పూర్తయ్యేసరికి మురళీ విజయ్ తర్వాత క్రీజులోకి వచ్చిన పూజారా(4), రాహుల్ స్థానంలో దిగిన కెప్టెన్ రహానె (4)పరుగులతో క్రీజులో ఉన్నారు.


ఎట్టకేలకు మురళీ విజయ్ సెంచరీ, రాహుల్ హాఫ్ సెంచరీ:

ఓపెనర్‌గా దిగి క్రీజులో పాతుకుపోయిన మురళీ విజయ్ ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేశాడు. రెండు సార్లు వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్‌లో.. మురళీ విజయ్ అదే పంథాలో బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో దిగిన లోకేశ్ రాహుల్ కూడా పరుగులు రాబట్టే యత్నంలోనే ఉన్నాడు. ఈ క్రమంలో మురళీ విజయ్ 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.

వర్షం కారణంగా మరోసారి ఆగిపోయిన మ్యాచ్:


వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం:

ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్న మురళీ విజయ్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు. ధావన్ అవుట్ అవడంతో మరో ఎండ్‌లో దిగిన లోకేశ్ రాహుల్ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. మంచి రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్‌లో వరుణుడు ఆటంకం కలిగించాడు.దీంతో అంఫైర్లు మ్యాచ్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ క్రమంలో 45.1 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 248పరుగులు సాధించింది. ఈ క్రమంలో మురళీ విజయ్(94), లోకేశ్ రాహుల్ (33) పరుగులతో క్రీజులో ఉన్నారు.


తొలి వికెట్.. ధావన్ ను కోల్పోయిన టీమిండియా:

ఆ తర్వాత లంచ్ విరామం ముగించుకుని బ్యాటింగ్‌కు దిగిన 28.4 ఓవర్‌కి యామిన్ అహ్మద్‌జై బౌలింగ్‌లో ధావన్ కొట్టిన షాట్‌ను నబీ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా 96 బంతులు ఆడిన ధావన్ 107 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు.


ధావన్ సెంచరీ పూర్తి, లంచ్ విరామం:

దూకుడు మీద ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ధావన్ అదే వేగాన్ని కొనసాగిస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్.. 25.5 ఓవర్లకి సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన మురళీ విజయ్ మాత్రం నిలదొక్కుకుని హాఫ్ సెంచరీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. లంచ్ విరామానికి ధావన్ (104), విజయ్ (41)తో క్రీజులో ఉన్నారు.

టీ 20 ఫార్మాట్‌లో అదరగొట్టిన రషీద్ ఖాన్ మాత్రం.. టెస్టు క్రికెట్‌లో కూడా అంతటి స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ 7ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ 51పరుగులు సమర్పించాడు.


తొలి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి:

20 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా.. 109 పరుగులు పూర్తి చేసినా టీమిండియా.. 15 ఓవర్లు ముగిసే సరికి 79 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(75), మురళీ విజయ్‌( 21) కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌న్‌ ముందుకు తీసుకెళుతున్నారు.

ఒకవైపు విజయ్‌ ఆచితూచి ఆడితే ధావన్‌ మాత్రం బౌండరీలతో మెరుపలు మెరిపించాడు. అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే 47 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో ధావన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు ధావన్‌కు ఇది ఆరో హాఫ్ సెంచరీ.


India vs Afghanistan 2018 Live Score: Rahane elects to bat first against debutants Afghanistan

టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా:

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత తాత్కాలిక టెస్టు కెప్టెన్ రహానే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. వన్డేల్లో, టీ20ల్లో అదరగొట్టేస్తున్న ఆఫ్గానిస్థాన్‌ తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి.

టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను పసికూన లాంటి ఆఫ్గాన్‌ ఎలా ఎదుర్కొంటుదన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్వితీయ విజయాలు సాధిస్తున్న ఆఫ్గాన్‌ను తేలికగా భారత్‌ తేలికగా తీసుకోవడం లేదు. సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రషీద్‌ ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే టెస్టు హోదాని పొందిన ఆఫ్ఘ‌నిస్థాన్‌తో భార‌త్ ఏకైక్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. కోహ్లి గైర్హాజ‌రీలో అజింక్యా ర‌హానే ఇండియాకి కెప్టెన్సీ వ‌హిస్తుండ‌గా, చాన్నాళ్ళ త‌ర్వాత దినేశ్ కార్తీక్ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. సుదీర్ఘ‌చరిత్ర ఉన్న ఇండియాకు ప్రత్యర్థి ఏ ర‌క‌మైన పోటీ ఇస్తుందోనని క్రికెట్ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్‌లో అలరించిన‌ ఆఫ్ఘాన్ టీం టెస్ట్ క్రికెట్‌లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

జట్ల వివరాలు:
భార‌త్: శిఖ‌ర్ ధావన్‌, ముర‌ళీ విజ‌య్‌, చ‌తేశ్వ‌ర్ పుజారా, అజింక్యా ర‌హానే (కెప్టెన్‌), లోకేష్ రాహుల్‌, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), హార్ధిక్ పాండ్యా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్‌

ఆఫ్ఘ‌నిస్థాన్‌: మ‌హ‌మ్మ‌ద్ షెహ‌జాద్‌, జావెద్ అహ్మ‌ది, ర‌హ్మ‌త్ షా, అజ్గ‌ర్ స్టానిక్ జై (కెప్టెన్), అఫ్జ‌ర్‌ జ‌జై (వికెట్ కీప‌ర్‌), మ‌హ‌మ్మ‌ద్ న‌బీ, హ‌ష్మ‌తుల్లా షాహిది, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌, యామిన్ అహ్మ‌ద్ జై, వ‌ఫాదార్

Story first published: Thursday, June 14, 2018, 18:33 [IST]
Other articles published on Jun 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X