న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రషీద్ ఖాన్ నుంచి భారత్‌కు గట్టి సవాలే ఎదురవనుంది'

Rashid Khan A Great Competitor To Indian Players
India vs Afghanistan 2018: Anil Kumble praises Rashid Khan, Mujeeb Ur Rahman

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో భారత్, అఫ్ఘనిస్థాన్ జట్టుతో ఏకైక టెస్టు ఆడనుంది. గతేడాది ఐసీసీ హోదా పొందిన అఫ్ఘన్ తన తొలి మ్యాచ్‌ను భారత్‌తోనే తలపడేందుకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా గురువారం నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కి అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సవాల్ విసరగలడని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.

దీనికి తోడు కొద్దిరోజులుగా ఆ జట్టు స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. గడిచిన వారంలో బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని అఫ్గానిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

'అఫ్గానిస్థాన్‌‌కి చెందిన ఇద్దరు స్పిన్నర్లు ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లని సైతం బోల్తా కొట్టిస్తున్న తీరు అద్భుతం. అయితే ఇప్పటి వరకు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు టీ20ల్లోనే ఎక్కువగా రాణించారు. కానీ.. టెస్టులతో పోలిస్తే టీ20 ఫార్మాట్ పూర్తి భిన్నం. కాబట్టి.. ఇప్పటివరకు మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తూ వచ్చిన ఈ ఇద్దరూ టెస్టుల్లో ఎలా రాణిస్తారోనని ఆసక్తి నెలకొంది. లయ అందుకుంటే భారత బ్యాట్స్‌మెన్స్‌కే కాదు.. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఈ స్పిన్నర్లు సవాల్ విసరగలరు' అని అనిల్ కుంబ్లే వెల్లడించారు.

ఐపీఎల్ 2018 సీజన్‌లో గూగ్లీ బంతులతో విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ, ఏబీ డివిలియర్స్ తదితర బ్యాట్స్‌మెన్స్‌ని రషీద్ ఖాన్ బోల్తా కొట్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.9కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్ జట్టుకు తగిన న్యాయం చేశాడు. జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. విలియమ్‌సన్ సేన ఫైనల్ చేరుకోవడానికి బౌలింగే ప్రధాన బలం.

Story first published: Tuesday, June 12, 2018, 9:10 [IST]
Other articles published on Jun 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X