న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్టులో పృథ్వీ షా కోసం మరో రికార్డు ఎదురుచూపు?

India vs West Indies 2018 : Prithvi Shaw's Another Milestone Is Waiting In The 2nd Test
India v West Indies, 2nd Test: Prithvi Shaw another milestone in hyderabad test

హైదరాబాద్: వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు యువ ఓపెనర్ పృథ్వీ షా. ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించి, ఆ ఘనత సాధించిన 15వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.

కోహ్లీ.. కోచ్ సమక్షంలో చర్చలు జరపనున్న పాలకుల కమిటీకోహ్లీ.. కోచ్ సమక్షంలో చర్చలు జరపనున్న పాలకుల కమిటీ

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అతను కొడుతున్న షాట్లకు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా పృథ్వీ షా మరో రికార్డుపై కన్నేశాడు. హైదరాబాద్‌ వేదికగా పర్యాటక విండిస్ జట్టుతో శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

1
44265
ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా?

ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా?

ఇంతకీ ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? తాను ఆడిన తొలి టెస్టులోనే ఇప్పటివరకూ మొత్తం 15 మంది భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు సాధించగా, ఇందులో ముగ్గురు వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ చేశారు. ఈ జాబితాలో సౌరవ్‌ గంగూలీ, అజహరుద్దీన్‌, రోహిత్‌ శర్మలు ఉన్నారు.

పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే

పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే

భారత్‌-వెస్టిండిస్ జట్ల మధ్య అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచులోనూ పృథ్వీ షా సెంచరీ నమోదు చేస్తే ఈ ముగ్గురి సరసన నిలుస్తాడు. అజహరుద్దీన్ 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ రికార్డు నెలకొల్పగా... అనంతరం 1996లో అదే జట్టుతో జరిగిన జరిగిన టెస్టు సిరీస్‌లో గంగూలీ ఈ రికార్డు సాధించాడు.

 వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు

వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు

ఇక 2013లో వెస్టిండిస్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు మ్యాచు ద్వారా ఆరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ముంబైలో జరిగిన రెండో టెస్టు మ్యాచులోనూ సెంచరీ సాధించి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

 రెండో టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధిస్తే

రెండో టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధిస్తే

హైదరాబాద్ వేదికగా 12న వెస్టిండిస్‌తో జరగనున్న రెండో టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధిస్తే ఈ రికార్డును అందుకుంటాడు. ఇదిలా ఉంటే ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన‌ 104వ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, October 11, 2018, 10:37 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X