న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంకిత భావంతో ఆడే వ్యక్తి శుభ్‌మాన్ మాత్రమే: ద్రవిడ్

Indias U19 World Cup hero Shubhnam Gill emulates his coach Rahul Dravid in First-Class cricket

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఆట కనబరుస్తున్న అండర్-19 వరల్డ్ కప్ హీరో శుభ్‌మన్ గిల్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. తమిళనాడుపై శనివారం ఆట ముగిసే సమయానికి 199 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్ (234 బంతుల్లో 199; 21ఫోర్లు, 4సిక్సులు), మన్‌దీప్ సింగ్ (131 బంతుల్లో 50) క్రీజులో ఉండటంతో.. 308/2తో పంజాబ్ శనివారం ఆటను ముగించింది.

199 నాటౌట్‌తో ఆ రోజు ఆటను ముగించిన బ్యాట్స్‌మెన్‌‌గా

199 నాటౌట్‌తో ఆ రోజు ఆటను ముగించిన బ్యాట్స్‌మెన్‌‌గా

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 199 నాటౌట్‌తో ఆ రోజు జరిగిన ఆటను ముగించిన బ్యాట్స్‌మెన్‌‌గా గిల్.. ద్రవిడ్ సరసన చేరాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత సాధించి రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 13 మంది ఆటగాళ్ల పేరిట ఉన్న రికార్డులో గిల్ చోటు దక్కించుకున్నాడు. 2003 అడిలైడ్ టెస్టులో ద్రవిడ్ 199 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉండగా ఆ రోజు ఆట ముగిసింది. దీంతో మరుసటి రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ద్రవిడ్ తన ఖాతాలో డబుల్ సెంచరీ వేసుకున్నాడు.

ఇండియా-ఎ, అండర్-19 జట్ల కోచ్‌ బాధ్యతలతో ద్రవిడ్

ఇండియా-ఎ, అండర్-19 జట్ల కోచ్‌ బాధ్యతలతో ద్రవిడ్

ఇండియా-ఎ, అండర్-19 జట్ల కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్న ద్రవిడ్ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలోనే 2016లో అండర్-19 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. కాగా, భారత్.. ఈ ఏడాది ఆరంభంలో టోర్నీ గెలిచి విజేతగా నిలిచింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలవడంతోపాటు మూడు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను సాధించాడు.

ముగిశాక ద్రవిడ్ ప్రశంసలు

ముగిశాక ద్రవిడ్ ప్రశంసలు

వరల్డ్ కప్ టోర్నీలో 372పరుగులు సాధించిన ద్రవిడ్ నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒక సెంచరీని పూర్తి చేశాడు. ‘కోచింగ్ కెరీర్లో నేను చూసినంత వరకు అత్యంత అంకిత భావంతో శ్రమించే ఆటగాడు గిల్' అని వరల్డ్ కప్ ముగిశాక ద్రవిడ్ ప్రశంసలు గుప్పించాడు.

అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో

అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో

ప్రస్తుతం తమిళానాడుపై తలపడుతోన్న మ్యాచ్ మినహాయించి ఐదు ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 471పరుగులు తన ఖాతాలో వేసుకున్న శుభ్‌మాన్ అరంగ్రేటంలోనే హాఫ్ సెంచరీతో కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత తన రెండో మ్యాచ్ లోనే సెంచరీ బాదేశాడు.

Story first published: Sunday, December 16, 2018, 14:29 [IST]
Other articles published on Dec 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X