న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మన బౌలింగ్ ముందు ఆసీస్ చిత్తుగా ఓడిపోవాల్సిందే'

India vs Australia 2018-2019 : Virat Kohli's India Ready to Create History | Oneindia Telugu
Indias best chance to beat Australia in Australia: Harbhajan Singh

హైదరాబాద్: రెండు నెలల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టిస్తోందని భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల కోసమని టీమిండియా గురువారం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ముందుగా ఇరు జట్ల మధ్య నవంబరు 21నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

 భారత ఫేసింగ్ దళం కచ్చితంగా

భారత ఫేసింగ్ దళం కచ్చితంగా

ఆ తర్వాత అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 6నుంచి టెస్టు సిరీస్‌, అది ముగిసిన తర్వాత వన్డే సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్‌ గడ్డపై గెలిచే అవకాశాలు భారత్‌కే మెండుగా ఉన్నాయని హర్భజన్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి నాయకులు లేని జట్టు పరిస్థితి ఆందోళనలో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌లోనూ అంతగా పరిణతి సాధించని ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారత ఫేసింగ్ దళం కచ్చితంగా విరుచుకుపడుతుందని హర్భజన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

టిమ్ పైనెను తొలగించిన ఆస్ట్రేలియా

టిమ్ పైనెను తొలగించిన ఆస్ట్రేలియా

కొద్ది రోజుల క్రితమే వన్డే కెప్టెన్సీ నుంచి టిమ్ పైనెను తొలగించిన ఆస్ట్రేలియా జట్టులో కొద్దిపాటి మార్పులు చేయాలని భావిస్తోంది. అయితే ఆ బాధ్యతలను ఆరోన్ ఫించ్ నిర్వహించనున్నాడు. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా క్రికెట్‌ను చూసిన అనుభవంతో ఆ జట్టుపై కచ్చితంగా గెలవగలమనే అభిప్రాయాన్ని తెలిపాడు.

 మైదానంలో 70శాతం ప్రదర్శన చేసినా

మైదానంలో 70శాతం ప్రదర్శన చేసినా

‘ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని భారత్‌ జట్టు పటిష్టంగా ఉంది. ఆసీస్‌ పేస్‌ దళాన్ని కూడా సులభంగా ఎదుర్కొగల సత్తా ఈ జట్టుకు ఉంది. ఆసీస్‌ జట్టు పేపర్‌పై బలంగానే కనిపిస్తున్నా కీలక ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేకపోవడం వారి బలహీనతే. ఎన్నో రికార్డులు సాధించిన భారత క్రికెటర్లు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై రాణించేందుకు ఇదే చక్కని సమయం. మైదానంలో 70శాతం ప్రదర్శన చేసినా చాలు.. భారత్‌ తప్పకుండా విజయం సాధించగలదు.' అని భజ్జీ తెలిపాడు.

సిరీస్‌లోపు స్మిత్, వార్నర్‌లు తిరిగొస్తే..

సిరీస్‌లోపు స్మిత్, వార్నర్‌లు తిరిగొస్తే..

స్మిత్, వార్నర్ లేరని ఆ జట్టుతో ఆడటం అంత సరదాగా ఉంటుందని చెప్పడం లేదు. జట్టులో నాణ్యత లోపించందని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ స్మిత్, వార్నర్‌లు గనుక సిరీస్‌లోపు తిరిగొస్తే.. సిరీస్ మరింత ఆసక్తికరంగా కొనసాగే అవకాశముంది.

Story first published: Friday, November 16, 2018, 17:09 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X