న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్

Yuvraj Singh Announces His Retirement From International Cricket || Oneindia Telugu
Indias 2011 World Cup hero, India All Rounder Yuvraj likely announce retirement from international Cricket

2011 ప్రపంచకప్‌ హీరో, భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‍‌కు కూడా యువీ వీడ్కోలు పలికారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎలా పోరాడాలో నేర్పింది:

ఎలా పోరాడాలో నేర్పింది:

ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ.. 'వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పింది. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా జట్టు సబ్యులకు కృతజ్ఞతలు. కష్ట కాలంలో నా వెంట ఉన్న కుటుంబ సబ్యులకు రుణపడి ఉంటా' అని యువరాజ్‌ పేర్కొన్నారు.

టీ20 టోర్నీలలో ఆడనున్న యువీ:

టీ20 టోర్నీలలో ఆడనున్న యువీ:

రిటైర్మెంట్‌ ప్రకటించిన యువీ.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. లీగ్ ఆరంభంలో 4 మ్యాచ్‌లలో ఆడి 98 పరుగులు చేసాడు.

6 బంతులకు 6 సిక్స్‌లు:

6 బంతులకు 6 సిక్స్‌లు:

ధోనీ సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ షోతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అందుకున్నాడు. అనంతరం క్యాన్సర్‌ బారిన పడి అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. చికిత్స అనంతరం యువీ కెరీర్‌ అంతగా సాగలేదు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Monday, June 10, 2019, 14:50 [IST]
Other articles published on Jun 10, 2019
Read in English: Yuvraj Singh retires
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X