న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: 9 ఏళ్ల తర్వాత టీ20ల్లో టీమిండియా చెత్త రికార్డు!

India Records Worst Record In 2nd T20 Match vs Sri Lanka

కొలంబో: శ్రీలంకతో రెండో టీ20లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. తమ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో అతి తక్కువ బౌండరీలు బాదిన అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 8 బౌండరీలు మాత్రమే సాధించింది. ఇందులో 7 ఫోర్లు ఉండగా.. ఓ సిక్సర్ ఉంది. టీమిండియా చివరిసారిగా 2009లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో అతి తక్కుగా 10 బౌండరీలు బాదింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతి తక్కువ బౌండరీలను కొట్టింది. ఈ ఏడు ఫోర్లలో కూడా కెప్టెన్ ధావన్ ఒక్కడే నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం.

ఇక బ్యాటింగ్‌కు ప్రతికూలమైన ఈ పిచ్‌పై శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాట్స్‌మన్ తడబడ్డారు. భారీ షాట్లు ఆడే క్రమంలో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేసింది. శిఖర్ ధావన్(40), దేవదత్ పడిక్కల్(29), రుతురాజ్ గైక్వాడ్(21) పర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. లంకబౌలర్లలో అకిలా ధనుంజయ రెండు వికెట్లు తీయగా.. చమీరా, హసరంగా, షనక తలో వికెట్ పడగొట్టారు.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(21), శిఖర్ ధావన్ శుభారంభం అందించినప్పటికీ ఇతర బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. దేవదత్ పడిక్కల్(27) రన్స్ చేసినా.. బంతులు వృథా చేశాడు. సంజూ శాంసన్(7) స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. చివర్లో కూడా లంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సూపర్ ఫీల్డింగ్‌తో బౌండీలను ఆపడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

అనంతరం చేజింగ్‌కు దిగిన శ్రీలంక.. ఆదిలోనే వికెట్ కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో ఆ జట్టు ఓపెనర్.. అవిష్కా ఫెర్నాండో ఆడిన భారీ షాట్‌ను రాహుల్ చాహర్ బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్నాడు.

Story first published: Wednesday, July 28, 2021, 22:06 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X