న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలిచినా మార్పులు తప్పేలా లేవు.. పంత్, శాంసనే మళ్లీ బెంచ్‌కే..

India Predicted XI for 2nd T20I - India Predicted XI - Virat Kohli to make one critical change

ఆక్లాండ్‌: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. సొంతగడ్డపై సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మట్టికరిపించిన భారత్.. రచ్చ గెలవడానికి న్యూజిలాండ్ టూర్‌కు వచ్చింది. తొలి టీ20లోనే అద్భుత విజయంతో ఆతిథ్య జట్టుకు చుక్కులు చూపించింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించేందుకు మరో పోరుకు సిద్ధమవుతోంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న రెండో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా హాట్ ఫేవరేట్ అయినప్పటికీ ఆతిథ్య జట్టును తక్కవ అంచానా వేయలేం.

మార్పులు తప్పేలా లేవు..

మార్పులు తప్పేలా లేవు..

తొలి టీ20లో ఆటను పరిగణలోకి తీసుకున్న మేనేజ్‌మెంట్ తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గ ధామమైన పిచ్‌లో అదనపు బ్యాట్స్‌మెన్ తీసుకోవాలా? లేక ఆరో బౌలర్ దించాలనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు కీపర్‌గా రిషభ్ పంత్ ఆడించాలా? లేక రాహుల్‌నే కొనసాగించాలా అనేదానిపై కూడా ఆలోచిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌తో ఓపెనర్ రోహిత్ శర్మ, శివం దూబేలతో పాటు శార్దూల్ ఠాకూర్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హార్డ్‌ హిట్టర్‌ అయిన శివం దూబేను తప్పించకపోవచ్చు.

బ్యాటింగ్‌లో సత్తాచాటకపోయినా, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా వికెట్‌ తీసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. టీ20 వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా హార్డ్‌ హిట్టర్‌ అయిన దూబేకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో రెండో టీ20లో ఆడే చాన్స్‌ ఎక్కువగా ఉంది. ఇక రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. తొలి టీ20లో రాహుల్‌, కోహ్లిలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే, అయ్యర్‌ సమయోచితంగా ఆడాడు. అయ్యర్‌కు మనీష్‌ పాండే నుంచి చక్కటి సహకారం లభించింది. మిడిల్‌ ఆర్డర్స్ బ్యాట్స్‌మన్‌గా వీరి స్థానాలకు డోకాలేదు.

శార్దూల్ ఠాకుర్ ఔట్.. సైనీ ఇన్

శార్దూల్ ఠాకుర్ ఔట్.. సైనీ ఇన్

తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన శార్ధుల్ ఠాకుర్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. మూడు ఓవర్లు వేసిన అతను ఏకంగా 44 పరుగులిచ్చాడు. లోయరార్డర్‌లో భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఠాకుర్.. పేలవ బౌలింగ్‌తో జట్టుకు ముప్పుగా మారాడు. దీంతోనే అతనిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఠాకుర్ స్థానంలో నవ్‌దీప్ సైనీకి చోటు దక్కవచ్చు. బుమ్రా, షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. జడేజా, చహల్ స్థానాలకు డోకా లేదు. కుల్దీప్, సుంధర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు. తొలి టీ20లో గాయపడ్డ బుమ్రా గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

న్యూజిలాండ్‌కు కఠిన పరీక్ష..

న్యూజిలాండ్‌కు కఠిన పరీక్ష..

వన్డే వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ అన్ని ఫార్మాట్లలో తడబడుతోంది. ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును దెబ్బతీస్తోంది. బౌల్డ్, ఫెర్గూసన్ వంటి బౌలర్లు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి టీ20లో 200 పైచిలుకు చేసినా కాపాడుకోలేకపోయింది. విలియమ్సన్, గప్టిల్, టేలర్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో మెరుగై విజయం సాధించాలని భావిస్తోంది.

Story first published: Saturday, January 25, 2020, 22:51 [IST]
Other articles published on Jan 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X