న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: అక్షర్ పటేల్ ఔట్.. చాహల్ ఇన్! నెదర్లాండ్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India Playing XI vs Netherlands: Yuzvendra Chahal likely to replace Axar Patel and Ashwin to continue

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022‌లో థ్రిల్లింగ్ విక్టరీతో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గ్రూప్-2లో భాగంగా నెదర్లాండ్స్‌తో గురువారం(అక్టోబర్ 27) జరగనున్నసూపర్ 12 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయాన్నందుకున్న భారత్ రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఇదే జోరులో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మరింత సులువు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు నెదర్లాండ్.. భారత్ లాంటి పటిష్ట జట్టును ఓడించి సంచలనం సృష్టించాలనుకుంటుంది.

తమ తొలి సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో నెదర్లాండ్ ఓడినప్పటికీ ఆఖరి వరకు పోరాడింది. అదే పోరాటాన్ని భారత్‌పై కనబర్చాలని ఉవ్విళ్లూరుతోంది. ఏ లెక్కన చూసుకున్న భారత్‌కు పోటీనిచ్చే స్థాయి నెదర్లాండ్‌ది కాదు. కానీ అంతమాత్రనా ఆ జట్టును తక్కువ అంచనా వేయాల్సిన పనిలేదు. అందుకే రోహిత్ సేన ఏమాత్రం ఈ మ్యాచ్‌ను లైట్ తీసుకోవాలనుకోవడం లేదు. ప్రధాన జట్లలానే అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది. భవిష్యత్తు మ్యాచ్‌లకు సన్నాహకంగా వాడుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే టీమ్‌కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 అక్షర్ పటేల్‌పై వేటు..

అక్షర్ పటేల్‌పై వేటు..

టోర్నీ ప్రారంభానికి ముందే టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు తుది జట్టులో మార్పులు చేర్పులు చేస్తామని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఫస్ట్ మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయిన అక్షర్ పటేల్‌పై వేటు పడే అవకాశం ఉంది. నెదర్లాండ్‌తో మ్యాచ్ జరిగే సిడ్నీ వేదిక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగారు.

ముఖ్యంగా కివీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(3/31), ఇష్ సోదీ(1/29) సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే భారత్ కూడా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అక్షర్ పటేల్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ డెప్త్ కోసం అశ్విన్‌ను కొనసాగించనున్నారు. మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే అక్షర్‌ను కొనసాగించవచ్చు.

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. పాక్‌తో చెలరేగిన కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఆడనున్నాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. కీలక పాకిస్థాన్‌ పోరులో కోహ్లీ మినహా ఈ ముగ్గురు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రాహుల్, రోహిత్ శర్మ ఔటైన విధానం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఇద్దరూ ఈ చిన్న దేశంపైన అయినా రాణించాల్సిన అవసరం ఉంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సూర్య సైతం నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు. అతను కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. విరాట్.. అదే జోరును కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.

హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్

హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్

ఐదో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ అక్షర్‌ను కొనసాగిస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయి. పాక్‌తో మ్యాచ్ హార్దిక్.. విరాట్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అతను అదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో కార్తీక్ సైతం విఫలమయ్యాడు. ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌తోనైనా తన ఫినిషర్ పాత్రకు అతను న్యాయం చేయాల్సి ఉంది. లేకుంటే జట్టులో చోటే గల్లంతవుతోంది.

హర్షల్ పటేల్‌‌కు మళ్లీ నిరాశే..

హర్షల్ పటేల్‌‌కు మళ్లీ నిరాశే..

పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లు కొనసాగడం ఖాయం. పిచ్ కండిషన్స్ ఆధారంగా హర్షల్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. కానీ సిడ్నీలో అతను ఆడే అవకాశాల్లేవ్. పాక్‌తో మ్యాచ్‌లో భారత పేసర్లు అదరగొట్టినా.. కీలక డెత్ ఓవర్లలో మరోసారి చేతులెత్తేసారు. ఆ లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. అర్ష్‌దీప్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ షమీ.. గాడిన పడాల్సి ఉంది.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/యుజ్వేంద్ర చాహల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Tuesday, October 25, 2022, 15:48 [IST]
Other articles published on Oct 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X