న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! సూర్యకుమార్‌ అరంగేట్రం!

India have won the toss and have opted to field, Suryakumar and Ishan Kishan are making their debuts

అహ్మదాబాద్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్-ఇంగ్లండ్ మధ్య నరేంద్ర మోడీ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ స్టార్స్ సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్ భారత్ తరఫున తమ మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అంతేకాదు శిఖర్ ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. రోహిత్ శర్మకు ఈ మ్యాచుకు కూడా రెస్ట్ ఇచ్చారు.

ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ కీలక పాత్ర పోషించారు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటారు. దాంతో భారత సెలెక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేయగా.. తొలి టీ20లో అవకాశం దక్కలేదు. మెరుగైన ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు రెండో మ్యాచులో అవకాశం వచ్చింది.

ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో మరింత ఆధిక్యం సంపాదించాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. మొటెరాలో 11 పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మ్యాచ్‌ అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్‌ కాస్త తక్కువగా ఉండి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

తుది జట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషబ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్ధూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్ ‌కుమార్‌, యుజువేంద్ర చహల్. ‌

ఇంగ్లండ్: జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరన్‌, జోఫ్రాఆర్చర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, అదిల్‌ రషీద్.

Vijay Hazare Trophy: పృథ్వీ షా మెరుపులు.. ఆదిత్య తారే సెంచరీ! విజయ్‌ హజారే ట్రోఫీ చాంపియన్ ముంబై!Vijay Hazare Trophy: పృథ్వీ షా మెరుపులు.. ఆదిత్య తారే సెంచరీ! విజయ్‌ హజారే ట్రోఫీ చాంపియన్ ముంబై!

Story first published: Sunday, March 14, 2021, 19:00 [IST]
Other articles published on Mar 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X